ఒకే రోజు 8వేల కేసులు.. 7వ స్థానంలో భారత్

కరోనా వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్న టాప్-10 ప్రపంచదేశాల జాబితాలో 7వ స్థానానికి ఎగబాకింది ఇండియా. సరిగ్గా వారం కిందట టాప్-10లోకి ప్రవేశించిన భారత్.. గడిచిన 5 రోజుల్లోనే 9వ స్థానం నుంచి 7వ…

కరోనా వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్న టాప్-10 ప్రపంచదేశాల జాబితాలో 7వ స్థానానికి ఎగబాకింది ఇండియా. సరిగ్గా వారం కిందట టాప్-10లోకి ప్రవేశించిన భారత్.. గడిచిన 5 రోజుల్లోనే 9వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకుంది. ఫ్రాన్స్, జర్మనీలో కేసుల సంఖ్య భారీగా తగ్గడం.. అదే సమయంలో ఇండియాలో కేసుల సంఖ్య రోజుకు వేలల్లో నమోదుకావడంతో.. భారత్ కు ఈ కోరుకోని ఘనత దక్కింది.

ప్రస్తుతం ఇండియా కంటే ముందు 6వ స్థానంలో ఇటలీ, 5వ స్థానంలో బ్రిటన్ ఉన్నాయి. మరో 3 వారాల్లో ఈ రెండు దేశాల్ని కూడా భారత్ అధిగమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జూన్ చివరి వారం వరకు దేశంలో కరోనా కేసులు భారీ ఎత్తున నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8392 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 190,535కు చేరుకుంది. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 230 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5394కు చేరుకుంది. దేశంలో ఇలా ఒకే రోజు 2వందలకు పైగా మృతిచెందడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93వేల మందికి పైగా చికిత్స పొందుతుండగా.. 91,819 మంది కోలుకున్నారు.

రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 67వేలు దాటింది. నిన్న ఒక్కరోజే 2487 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు తమిళనాడు-ఢిల్లీలో కూడా వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 1149, ఢిల్లీలో 1295 కేసులు నమోదయ్యాయి. 22,333 కేసులతో రెండో స్థానంలో తమిళనాడు, 19,844 కేసులతో మూడో స్థానంలో ఢిల్లీ, 16,779 కేసులతో గుజరాత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.

కోలుకున్న వారి సంఖ్య ఆధారంగా చూసుకుంటే.. పంజాబ్ లో రికవరీ రేటు అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో వందలో 88 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటున్నారు. రాజస్థానంలో ఈ రేటు 66.6గా ఉంది. ఇక మూడో స్థానంలో అంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీలో కరోనా రికవరీ రేటు 64.1గా ఉంది. తెలంగాణలో ఈ రేటు 56.5గా ఉంది.

కేసీఆర్ ప్లాన్ బాలయ్యకు ముందే తెలుసా