21 ఏళ్ల అనుబంధంతో ప్ర‌కాశ్‌రాజ్‌ తెగ‌దెంపులు

“మా”తో 21 ఏళ్ల అనుబంధానికి ప్ర‌కాశ్‌రాజ్ తెగ‌దెంపులు చేసుకున్నారు. “మా” ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం ఆయ‌న సోమ‌వారం మీడియా ముందుకొచ్చారు.  Advertisement భావోద్వేగంతో ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ముందుగా అధ్య‌క్షుడిగా గెలుపొందిన మంచు…

“మా”తో 21 ఏళ్ల అనుబంధానికి ప్ర‌కాశ్‌రాజ్ తెగ‌దెంపులు చేసుకున్నారు. “మా” ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం ఆయ‌న సోమ‌వారం మీడియా ముందుకొచ్చారు. 

భావోద్వేగంతో ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ముందుగా అధ్య‌క్షుడిగా గెలుపొందిన మంచు విష్ణుకు ఆయ‌న శుభాకాంక్ష‌లు చెప్పారు.

ఈ ఎన్నిక‌లు ప్ర‌ధానంగా ప్రాంతీయ‌త ఆధారంగా జ‌రిగాయ‌న్నారు. మా అధ్య‌క్షుడిగా తెలుగు వ్య‌క్తిని ఎన్నుకున్నార‌న్నారు. లోక‌ల్‌, నాన్‌లోక‌ల్ అనే ఎజెండా ఉన్న మా సంస్థ‌లో తాను ఉండ‌లేన‌ని, స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

తాను తెలుగువాడిని కాద‌న్నారు. త‌న త‌ల్లిదండ్రులు తెలుగు వాళ్లు కాద‌న్నారు. ఇది వాళ్ల త‌ప్పు, త‌న త‌ప్పు కాద‌న్నారు. తాను అతిథిగా వ‌చ్చాన‌ని, అతిథిగానే ఉంటాన‌ని ఆయ‌న అన్నారు.

 “మా” స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డం బాద‌తో తీసుకున్న నిర్ణ‌యం కాద‌న్నారు. తాను అబ‌ద్ధాలు చెప్ప‌న‌ని, ఆ అల‌వాటు లేద‌న్నారు. క‌ళాకారుడిగా త‌న‌కు ఆత్మ‌గౌర‌వం ఉంద‌న్నారు. 

మా స‌భ్య‌త్వం లేకుంటే సినిమాల్లో న‌టించ‌నివ్వ‌రా అని ప్ర‌శ్నించారు. మా స‌భ్య‌త్వం లేకుంటే స్టూడియోల్లోకి రానివ్వ‌రా అని ప్ర‌శ్నించారు. చైత‌న్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశార‌న్నారు. మా అంతా ఒక్క‌టే అనే అబ‌ద్ధాన్ని తాను న‌మ్మ‌న‌ని ప్ర‌కాశ్‌రాజ్ తేల్చి చెప్పారు.