ప్రగ్యా జైశ్వాల్ కు కరోనా… బాలయ్య పరిస్థితేంటి?

హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ బాంబ్ పేల్చింది. తను మరోసారి కరోనా బారిన పడినట్టు ప్రకటించింది. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికీ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్టు ప్రకటించింది.  Advertisement గడిచిన 10 రోజులుగా తనతో…

హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ బాంబ్ పేల్చింది. తను మరోసారి కరోనా బారిన పడినట్టు ప్రకటించింది. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికీ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్టు ప్రకటించింది. 

గడిచిన 10 రోజులుగా తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రగ్యాకు పాజిటివ్ అని తెలియడంతో అఖండ యూనిట్ టెన్షన్ లో పడింది.

రీసెంట్ గా అఖండ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా యూనిట్ లో కీలక సభ్యులంతా పార్టీ చేసుకున్నారు. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తో క్లోజ్ గా గడిపారు. ఆమెతో కలిసి బాలయ్య, బోయపాటి లాంటి వాళ్లంతా ఫొటోలు దిగారు.

కట్ చేస్తే.. ఈ పార్టీ జరిగిన 3 రోజులకే తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రగ్యా ప్రకటించింది. దీంతో అఖండ యూనిట్ నెత్తిన పిడుగుపడింది. మరీ ముఖ్యంగా బాలయ్య పరిస్థితేంటంటూ ఆరాలు ఎక్కువయ్యాయి. 

ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. సరిగ్గా బాలయ్య ''మా'' ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన టైమ్ లో ప్రగ్యా ఈ మేటర్ బయటపెట్టింది.

ఆయన అలా ఓటు వేయడం, ఈమె ఇలా ట్వీట్ చేయడం వెంటవెంటనే జరిగాయి. దీంతో పోలింగ్ టైమ్ లో బాలయ్యతో తో టచ్ లోకి వెళ్లినవాళ్లంతా ఇప్పుడు టెన్షన్ లో పడ్డారు. ప్రస్తుతానికైతే అఖండ యూనిట్ అందరికీ మరోసారి కరోనా నిర్థారణ పరీక్షలు చేయించాలని మేకర్స్ నిర్ణయించారు.