మెగా నటుడు నాగబాబు మరోసారి మా ఎన్నికల నేపథ్యంలో తన భావాలు వ్యక్తం చేసారు. తను భాజపా సింపథైజర్ ను అని, ప్రకాష్ రాజ్ కమ్యూనిస్ట్ అని, అయినా కూడా తన అన్నకు బాగా క్లోజ్ అని, చిరంజీవి పక్కకు వెళ్లి కూర్చుంటాడు అని, కనుక తనకూ స్నేహితుడే అని నాగబాబు అన్నారు.
ప్రకాష్ రాజ్ చేస్తాడని తెలిసిన తరువాత ఆయనకు అనుకూలంగా చేయమని అన్నయ్య తనను కోరానన్నారు. అదే సమయంలో తాను ముందుగా ఎవరికన్నా మాట ఇచ్చానేమో అని అడిగారు కూడా అన్నారు. సీనియర్ పొలిటీషియన్, లాయర్ అయిన సుబ్రహ్మణ్యస్వామితోనే డిబేట్ చేసి ప్రకాష్ రాజ్ డామినేట్ చేసారని, అది తనకు చాలా నచ్చిందని నాగబాబు అన్నారు.
అలాంటి ప్రకాష్ రాజ్ కు ఈ ఎన్నికలు అన్నవి చాలా చిన్న విషయం అని ఆయన అన్నారు. మా అసోసియేషన్ కు అవసరం అయితే మోడీతో, అమిత్ షా తో మాట్లాడి, ఏదైనా తీసుకురాగల దమ్మున్నవాడు ప్రకాష్ రాజ్ అంటూ ఆ దమ్ము మీకు కానీ మీ ప్యానల్ లో వారికి కానీ వుందా అంటూ నాగబాబు అవుతలి ప్యానల్ ను ప్రశ్నించారు.
ప్రకాష్ రాజ్ కు నూటికి నూరు శాతం మద్దతు ఇస్తాం అని నాగబాబు ప్రకటించారు. మా ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని, అదే నిజమైతే మా అసోసియేషన్ మసకబారుతోందన్న తన మాట నిజమే అవుతుందన్నారు.
మంచి వాడిని ఎన్నుకుంటే సభ్యులు గెలుస్తారని, చాతకానివాడిని ఎన్నుకుంటే సభ్యులు ఓడినట్లే అని నాగబాబు అన్నారు. ప్రకాష్ రాజ్ ను గెలిపించడానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని కానీ ఆయన కనీసం మూడు టెర్మ్ లు మా అధ్యక్షుడిగా వుండాలని నాగబాబు అన్నారు. ఆయన వెనుక తామున్నామని ఆయన స్పష్టం చేసారు.