‘మా’ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ మద్దతు ప్రకటించారు. సినిమా గ్రూపులకు అతీతంగా అందరూ ఒక్కమాటపై ప్రకాశ్‌రాజ్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
సమస్యలపైన, సమాజంపైన అవగాహన ఉన్న వ్యక్తికి ఓటు వేస్తేనే అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మా’ ఎన్నికల తీరుపై మనసులో మాటను చెప్పారు.
ఈ తరం నటుల్లో ప్రత్యేకతను చాటుకున్న ప్రకాశ్‌రాజ్ ‘మా’ అధ్యక్ష బరిలో నిలబడడం సంతోషకరమన్నారు. ప్రకాశ్‌రాజ్‌ను గెలిపించడం అంటే ఒక ప్రజాస్వామ్య వాదిని గెలిపించినట్టుగా ఆయన అభివర్ణించారు. ప్రకాశ్‌రాజ్ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే దక్షిణ భారతదేశంలోనే ఒక విలువైన నాయకుడిగా గుర్తింపు పొందుతారన్నారు.
ప్రస్తుతం ‘మా’ ఎన్నికల్లో జరుగుతున్న గ్రూపు రాజకీయాలకు భిన్నంగా సభ్యులంతా ఓటు వేయాలని అద్దంకి దయాకర్ కోరారు. ప్రకాశ్‌రాజ్‌ను గెలిపించడం ద్వారా సినీ పరిశ్రమ ప్రజాస్వామ్యయుతంగా ఉందని నిరూపించాలని సినీ పెద్దలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
బహుశా మా ఎన్నికల్లో మొట్టమొదటి రాజకీయ మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే దక్కినట్టుంది. అది కూడా అద్దంకి దయాకర్ రూపంలో కావడం గమనార్హం.