హీరోయిన్ ప్రణీత బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ప్రణీత, నితిన్ రాజు దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు నితిన్ ప్రకటించాడు. బిడ్డను పరిచయం చేస్తూ వాళ్లు ఫొటో కూడా షేర్ చేశారు.
ప్రణీత-నితిన్ కు ఇప్పటికే ఓ అమ్మాయి ఉంది. 2022 జూన్ లో పాప పుట్టింది. ఇప్పుడు రెండేళ్ల గ్యాప్ లో బాబుకు జన్మనిచ్చింది ప్రణీత.
తను గర్భం దాల్చిన విషయాన్ని కొన్ని నెలల కిందట అధికారికంగా ప్రకటించింది ప్రణీత. రౌండ్-2 అనే క్యాప్షన్ పెట్టి మరీ ప్రెగ్నెన్సీ ఫొటోల్ని షేర్ చేసింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫొటోల్ని ఆమె షేర్ చేస్తూనే ఉంది.
పాపకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లోకి వచ్చింది ప్రణీత. ఇప్పుడు బాబుకు జన్మనివ్వడంతో, ఆమె మరోసారి తన కెరీర్ కు గ్యాప్ ఇవ్వనుంది. అయితే కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టనని, కొనసాగిస్తానని ఆమె ఇదివరకే ప్రకటించింది.
31 ఏళ్ల ప్రణీత, సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తోంది. బిడ్డకు జన్మనివ్వడానికి కొన్ని నెలల ముందు ఆమె ఓ కన్నడ, ఓ మలయాళ సినిమాలో నటించింది. కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని తిరిగి హీరోయిన్ గా నటిస్తానంటోంది ప్రణీత.
All the best
Call jobs 8341510897
vc available 9380537747