ప్రేమనిస్తే..విషాన్నిచ్చారు

నాగవర్మ బైర్రాజు, దివ్యరావు హీరో హీరోయిన్లుగా నటించిన విక్రమ్ మూవీ టీజర్‌ను ప్రేమికుల దినోత్సవం కానుకగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. డైరెక్టర్ బాబీ ఈ టీజర్‌ను విడుదల చేశారు.  Advertisement ప్రేమలో…

నాగవర్మ బైర్రాజు, దివ్యరావు హీరో హీరోయిన్లుగా నటించిన విక్రమ్ మూవీ టీజర్‌ను ప్రేమికుల దినోత్సవం కానుకగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. డైరెక్టర్ బాబీ ఈ టీజర్‌ను విడుదల చేశారు. 

ప్రేమలో విఫలమైన ఓ భగ్న ప్రేమికుడు అసలేం జరిగిందో తనకు తాను చెప్పుకునేలా టీజర్‌ కట్ చేశారు. తన ప్రేయసితో గడిపిన క్షణాలు , కొండపై ఒంటరిగా ఏడుస్తుండటం ఆ వెంటనే సిగరెట్లు , మద్యం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నేటి యువతకు ఏం కావాలో అన్ని ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. 

ఇక చివరిలో యాక్షన్ షాట్స్‌తో టీజర్ ముగుస్తుంది. భగ్న ప్రేమికుడిగా, లవర్‌గా, యాక్షన్‌ సీన్లలో నాగవర్మ కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.  

ఆదిత్య ఓం, ఖయ్యూమ్, సురేష్, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్, ఫిష్ వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు హరిచందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సురేశ్ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా, వేణు మురళీధర్ వడ్నాల కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.