కొందరు అంతే..తిను..తినిపించు అనే స్ట్రాటజీ పెట్టుకుంటారు. ఓ టాలీవుడ్ హీరో కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నారట. సహజంగానే ఆయన భోజనప్రియడు. అంతే కాదు, అర్థరాత్రి అయినా సరే చుట్టూ ఉన్న మిత్రబృందం కోరిన ఫుడ్ క్షణాల్లో తెప్పించడం ఆయన స్పెషాలిటీ. ఇక మందు, సిగరెట్లు లాంటివి చిన్న చిన్న విషయాలు.
అయితే ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ టీమ్ తో పనిచేస్తున్నారు. వాళ్లకు మన తెలుగు ఆతిథ్యాలు పరిచయం తక్కువ. డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో 18 మంది వరకు వున్నారట. షూటింగ్ వున్న రోజుల్లో సాయంత్రం ఆరు దాటితే హీరోగారు ఖానా బజనా మొదలుపెట్టేస్తున్నారట.
తిండే తిండి..రకరకాల నాన్ వెజ్ అయిటమ్ లు, ఇక లిక్కర్ ఇంట్రస్ట్ వున్నవారికి తాగినంత…రాత్రి పన్నెండు దాటేస్తోందని టాక్. అంతా బాగానే వుంది. హోస్ట్ లు, గెస్ట్ లు అంతా హ్యాపీనే.
కానీ సినిమా హీరో అంటే ఫిజిక్ కీలకం. ఈ మధ్య ఆ హీరోను చూసిన వారు మొహంలో, ఫిజిక్ లో తేడా కొడుతూందని బాధపడుతున్నారు. ఆ సిజి చెక్కుడు వుందిగా మరి కొందరు లైట్ తీసుకుంటున్నారు.