సలార్ కోసం సంప్రదించారు కానీ..?

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాలో మలయళీ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకుంటున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు. తన లేటెస్ట్…

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాలో మలయళీ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకుంటున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు. తన లేటెస్ట్ మూవీ కడువా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన పృధ్వీరాజ్, సలార్ ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనని ప్రకటించాడు. అయితే తను ఇంకా ఓకే చెప్పలేదని కూడా క్లారిటీ ఇచ్చాడు.

“సలార్ చాలా పెద్ద సినిమా. నా డేట్స్ వల్ల ఆ సినిమాకు ఇబ్బంది రాకూడదు. ప్రభాస్ లాంటి స్టార్ ఇబ్బంది పడకూడదు. ప్రభాస్ లాంటి స్టార్ ను నా డేట్స్ కోసం వెయిట్ చేయించడం నాకిష్టం లేదు. అందుకే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒకవేళ సలార్ నేను చేస్తే మాత్రం అన్ని భాషల్లో నేనే డబ్బింగ్ చెబుతా. ఎంత లేట్ అయినా నేనే డబ్బింగ్ చెప్పాలి. అలా అగ్రిమెంట్ రాయించుకుంటాను.”

సలార్ రిలీజ్ డేట్ పై ఆల్రెడీ మేకర్స్ ఓ నిర్ణయానికి రావడంతో, తనకు డబ్బింగ్ చెప్పే అవకాశం రాకపోవచ్చని, కాబట్టి సలార్ లో నటిస్తానో లేదో చెప్పలేనని తేల్చేశాడు పృధ్వీరాజ్. సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదన్నాడు.

ఇక టాలీవుడ్ లో దర్శకుడిగా కూడా సత్తా చాటుతానంటున్నాడు ఈ నటుడు కమ్ డైరక్టర్. టాలీవుడ్ నుంచి 2 పెద్ద నిర్మాణ సంస్థలు, కొచ్చిన వచ్చి మరీ తనను సంప్రదించాయని తెలిపాడు. ప్రస్తుతం మంచి సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానని, పేపర్ పై కనీసం రఫ్ వెర్షన్ రెడీ అయినా తెలుగు సినిమా ప్రకటిస్తానని అన్నాడు.