Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రియ‌మ‌ణి-ముస్త‌ఫాల వివాహం చెల్ల‌దు

ప్రియ‌మ‌ణి-ముస్త‌ఫాల వివాహం చెల్ల‌దు

త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండా న‌టి ప్రియ‌మ‌ణి-ముస్త‌ఫారాజ్ చేసుకున్న వివాహం చ‌ట్ట ప్ర‌కారం చెల్ల‌ద‌ని ...ముస్త‌ఫారాజ్ మొద‌టి భార్య ఆయేషా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. ఆయేషా-ముస్త‌ఫారాజ్ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. వీళ్ల దాంప‌త్య జీవితంలో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో 2010 నుంచే వేర్వేరుగా బతుకుతున్నారు. 2017లో ముస్తఫా రాజ్‌ను ప్రియ‌మ‌ణి ప్రేమ వివాహం చేసుకున్నారు. 

పెళ్లి త‌ర్వాత కూడా ఆమె కెరీర్‌ను విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నారు. దక్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి నటిగా ప్రియ‌మ‌ణి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా విడుద‌లైన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’ వెబ్‌సిరీస్‌, ‘నారప్ప’లో ఆమె న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.  

ఈ నేప‌థ్యంలో ముస్త‌ఫారాజ్ మొద‌టి భార్య ఆయేషా ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రియ‌మ‌ణిని త‌న భ‌ర్త పెళ్లి చేసుకోవడంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. స‌ద‌రు చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఏమ‌న్నారో తెలుసుకుందాం. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండా వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకోవ‌డంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు ఆమె చెప్పుకొచ్చారు.  

‘ ఇప్పటివరకూ మేమిద్దరం విడాకుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. కాబట్టి ప్రియమణితో ఆయన పెళ్లి చెల్లదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విషయాన్ని బయటపెట్టాలనుకున్నప్పటికీ ఇద్దరు పిల్లల తల్లిగా పరిస్థితుల కారణంగా పెదవి విప్పలేకపోయాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని ఆయేషా తెలిపారు.

ఆయేషా పెట్టిన కేసుతో పాటు ఆమె ఆరోప‌ణ‌ల‌పై ముస్తఫా సీరియ‌స్‌గా స్పందించారు. ఆయేషా ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతోంద‌న్నారు. ఆయేషా కావాలనే ఇదంతా చేస్తోంద‌న్నారు. ఆమె నుంచి విడిపోయిన రోజు నుంచి పిల్లల సంరక్షణ తానే చూసుకుంటున్న‌ట్టు తెలిపారు. 

త‌న‌ బాధ్యతగా వాళ్ల సంరక్షణకు కావాల్సిన డబ్బుల్ని పంపిస్తున్న‌ట్టు చెప్పారు. 2017లో ప్రియమణితో త‌న‌కు వివాహమైతే, ఇన్నేళ్ల త‌ర్వాత ఆయేషా ఆరోపణలు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న ద‌గ్గ‌రి నుంచి మ‌రింత డ‌బ్బు దొంగ‌లించ‌డంలో భాగంగానే ఆమె ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆయేషా చెబుతున్న‌ట్టు తాను హింసించి ఉంటే ఇంత‌కాలం ఎందుకు నోరు మెద‌ప‌లేద‌ని ఆయ‌న నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?