Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రియమణి.. యాక్ట్ 1978

ప్రియమణి.. యాక్ట్  1978

కన్నడంలో ఏడాదిన్నర క్రితం విడుదలయిన సినిమా యాక్ట్ 1978. ప్రభుత్వ ఉద్యోగుల పనికి సంబంధించిన చట్టం ఇది. 

ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన డబ్బులు రాకపోతే ఓ గర్భిణీ స్త్రీ తెగించి ఏం చేసింది అన్న పాయింట్ చుట్టూ, అల్లిన కథ తో తీసిన సినిమా అది. మాంచి ప్రశంసలు అందుకుందీ సినిమా. 

మన్సోర్ దర్శకత్వం వహించిన ఈ చిన్న సినిమాలో యజ్ఞశెట్టి హీరోయిన్. ఆర్జీవీ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీపార్వతి గా నటించింది ఈమే. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

చిన్న సినిమాలు తీసి ఓటిటికి ఇవ్వడం అనే కాన్సెప్ట్ మీద టాలీవుడ్ దృష్టిపడిన నేపథ్యంలో నిర్మాత టాగోర్ మధు ఈ సినిమా రైట్స్ కొన్నారు. 

తెలుగులో చేయాల్సి వుంది. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి, సరైన హీరోయిన్ ను ఛూజ్ చేసుకోవాల్సి వుంది. ప్రియమణి అయితే బెటర్ అనే ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?