ఈమధ్య క్లారిటీలు ఇవ్వడమే పనిగా పెట్టుకుంది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇప్పుడీ ముద్దుగుమ్మపై మరో పుకారు చెలరేగింది. తమిళ నటుడు జయం రవి, ఈమె పెళ్లికి సిద్ధమౌతున్నారట. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా పూర్తయిందంట.
ఈ మేరకు వీళ్లిద్దరూ దండలతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ కు చెందిన ప్రియాంక ఫ్రెండ్స్ కొంతమంది ఆమెకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు కూడా చెప్పారు.
అయితే, ఈ ఫొటో నిజమే కానీ, మేటర్ మాత్రం అది కాదు. ఓ సినిమా ఓపెనింగ్ లో భాగంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటో అది. టాలీవుడ్ లో సినిమా ఓపెనింగ్ కు కొబ్బరికాయ కొట్టి, క్లాప్ కొడతారు. అదే కోలీవుడ్ లోనైతే దీంతో పాటు కీలకమైన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ పూలదండలు కూడా వేస్తారు.
అలా జయం రవితో చేసిన సినిమా ఓపెనింగ్ కు అతడితో కలిసి పూల దండ వేసుకొని ఫొటోలకు పోజులిచ్చింది ప్రియాంక మోహన్. దీంతో ఈ ఫొటో చూసి చాలామంది పుకార్లు రేపారు.
అది కేవలం సినిమాకు సంబంధించిన స్టిల్ అని, జయంరవితో తనకు నిశ్చితార్థం లాంటిదేం జరగలేదని ప్రియాంక క్లారిటీ ఇచ్చింది. ఈ పుకారు గట్టిగా వ్యాపించడానికి మరో కారణం కూడా ఉంది. రీసెంట్ గా జయం రవి తన భార్యకు విడాకులిచ్చాడు. అతడు ఇలా విడాకులిచ్చి, అలా ప్రియాంక మోహన్ తో నిశ్చితార్థం చేసుకున్నాడంటూ పుకార్లు వ్యాపించాయి. అదీ సంగతి.
vc available 9380537747
Call boy works 9989793850
Do you have call boy work
Inkka yenni pellilu chesukuntaru ippatike akrama sambandhalu yekkuva aipoyai