సాయిపల్లవి సొంత గొంతుక

సినిమా మొత్తం పూర్తయ్యాక, డబ్బింగ్ వేరే వాళ్లు చెప్పేసాక చూసుకుంటే, సాయిపల్లవికి అంత సంతృప్తి అనిపించలేదట.

సాయిపల్లవి వాయిస్ చాలా వైవిధ్యంగా వుంటుంది. అమెకు తెలుగు స్పష్టంగా వచ్చు. కానీ ఇప్పటి వరకు తెలుగులో నేరుగా డబ్బింగ్ చెప్పలేదు. ఇప్పుడు తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

కేవలం తెలుగులో మాత్రమే కాదు. హిందీలో కూడా సాయి పల్లవినే డబ్బింగ్ చెప్పారు. ఈవారాంతంలో విడుదలవుతోంది అమరన్ సినిమా. మేజ‌ర్ ముకుందన్ బయోపిక్ ఇది. శివకార్తికేయన్ హీరో, ఈ సినిమా పలు భారతీయ భాషల్లో దీపావళి సందర్భంగా విడుదలవుతోంది.

ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువే వుంటుంది. సినిమా మొత్తం పూర్తయ్యాక, డబ్బింగ్ వేరే వాళ్లు చెప్పేసాక చూసుకుంటే, సాయిపల్లవికి అంత సంతృప్తి అనిపించలేదట. కొన్ని కీలకమైన భావోద్వేగ సన్నివేశాల్లో డైలాగులు ఇంకా బాగా చెప్పించి వుంటే బాగుండేది అనిపించిందట. దాంతో ధైర్యం చేసి తెలుగులో డబ్బింగ్ చెప్పేసిందట. తరువాత హిందీలో కూడా తన గొంతుకనే వినిపించిందట.

దాదాపు రెండేళ్ల నుంచి తెలుగులో సినిమా రాకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదట. తండేల్ సినిమాలో తన డ్యాన్స్ ను ఓ పాటలో చూడవచ్చని, దాని తరువాత రెండు స్క్రిప్ట్ లు అల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో వున్నాయని చెప్పారు సాయిపల్లవి.

6 Replies to “సాయిపల్లవి సొంత గొంతుక”

Comments are closed.