రికార్డ్ ఓపెనింగ్స్ కోసం రికార్డ్ రిలీజ్

మొదటి రోజు వసూళ్లలో సరికొత్త రికార్డ్ సృష్టించాలంటే ఏం చేయాలి? మొదటి రోజు మ్యాగ్జిమమ్ స్క్రీన్స్ లో సినిమాను వేయాలి. అదే టైమ్ లో బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు కుమ్మేయాలి. ప్రస్తుతం…

మొదటి రోజు వసూళ్లలో సరికొత్త రికార్డ్ సృష్టించాలంటే ఏం చేయాలి? మొదటి రోజు మ్యాగ్జిమమ్ స్క్రీన్స్ లో సినిమాను వేయాలి. అదే టైమ్ లో బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు కుమ్మేయాలి. ప్రస్తుతం ఇదే ప్లానింగ్ లో ఉంది పుష్ప-2 యూనిట్.

కనివినీ ఎరుగని రీతిలో పుష్ప-2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో దేశీయంగా 6500 స్క్రీన్స్ ఉండగా, దేశం వెలుపల 5వేల స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ ఈ స్క్రీన్ కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉందంటోంది యూనిట్.

ఇక మొదటి రోజు షోల విషయంలో కూడా ప్లానింగ్ రెడీ అయింది. ఏపీ, నైజాంలో అర్థరాత్రి ఒంటి గంట నుంచే పుష్ప-2 షోలు పడబోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో రికార్డ్ బ్రేకింగ్ షోలకు లైన్ క్లియర్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మిడ్-నైట్ షోలకు అనుమతులొస్తున్నాయి కాబట్టి.. మొదటి రోజు షో కౌంట్ భారీగా ఉండబోతోంది. అటు ఉత్తరాదిన కూడా మొదటి రోజు స్క్రీన్ కౌంట్ పై చర్చలు సాగుతున్నాయి. సో.. మొదటి రోజు పుష్ప-2 వసూళ్లు ఊహకు కూడా అందని విధంగా ఉండబోతున్నాయి.

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది పుష్ప-2 సినిమా. అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు.

16 Replies to “రికార్డ్ ఓపెనింగ్స్ కోసం రికార్డ్ రిలీజ్”

  1. ఇప్పుడు టికెట్ల రేట్లు 20 రూపాయలకు చేస్తే ఎలా ఉంటుంది????

    పేదవాళ్ళు వీరప్నన్ ఆత్మకథ చూసి ఇన్స్పైర్ అవ్వకూడదా????

  2. ధియేటర్ లు ఎన్ని పెంచితే ఏంటి చూడటానికి జనం రావాలి గా 175 సీట్లు లో పోటీ చేసిన పార్టీ కి 11 సీట్లు వస్తే 21 సీట్లే పోటీ చేసిన పార్టీ కి 21 వచ్చాయి

    1. పావలా లు చూడకపోతే ఏంటి నార్త్ కలెక్షన్స్ చాలు. 1000cr కొట్టడానికి. పావలా బ్యాచ్

    1. అరేయ్ పావలా కుక్క. పావలా గురించి కాదు సినిమా. చెక్క పావలా. అందరూ చూస్తారు. పావలా చూడకపోతే పావలా నష్టం అంతే

Comments are closed.