రావడమే సూపర్ హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సక్సెస్ అందులో హీరోకు కలిసొచ్చినంతగా ఈమెకు కలిసిరాలేదు. పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో మధ్యలో కోలీవుడ్ కు కూడా వెళ్లింది.
ఆ తర్వాత తెలుగు నుంచి ఆమెకు ఓ ఆఫర్ వచ్చింది. నిజానికి అందులో ఆమెది హీరోయిన్ రోల్ కాదు. కాకపోతే తన పాత్రకు మంచి పేరొస్తుందనే ఉద్దేశంతో ఒప్పుకుంది.
అంతా బాగానే ఉంది కానీ, రెమ్యూనరేషన్ విషయంలో మరోసారి ఆ ముద్దుగుమ్మకు అన్యాయం జరిగింది. షూటింగ్ కు ముందు చెప్పింది ఒకటి, షూటింగ్ పూర్తయిన తర్వాత ఇచ్చింది ఇంకొకటి. దీంతో ఆ చిన్న హీరోయిన్ ఎవ్వరికీ చెప్పుకోలేక తనలో తాను మధనపడింది.
నిజానికి యూనిట్ అంతా కలిసి చాలా రోజులు అమెరికాలో షూటింగ్ చేశారు. ఆ టైమ్ లో ఆ సినిమాకు ప్రొడ్యూసర్ లాంటి ఓ వ్యక్తి, సదరు హీరోయిన్ తో అమెరికాలో షాపింగ్ చేయించాడు.
ఆ తర్వాత రెమ్యూనరేషన్ లో కోత పెట్టాడు. నిజానికి యూఎస్ లో షాపింగ్ ఎమౌంట్ చాలా తక్కువ. పారితోషికంలో కోత కోసింది చాలా ఎక్కువ.
కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై ఫిలింనగర్ లో గుసగుసలు మొదలయ్యాయి. సదరు హీరోయిన్ పై జాలి చూపిస్తూనే, ఆ 'ప్రొడ్యూసర్' బుద్ధి అంతే అంటూ చర్చించుకుంటున్నారు. అన్నట్టు రీసెంట్ గా రిలీజైన ఆ సినిమా ఫ్లాప్ అయింది.