లోకేష్ ఎక్కడ? ఏమైపోయారు..?

రాష్ట్రంలో వరదలు వచ్చిన రెండు వారాలకి నారా లోకేష్.. ఎంట్రీ ఇచ్చారు. వస్తూ వస్తూనే వరి చేలో దిగి, అనుకూల మీడియాని వెంటేసుకుని హడావిడి చేశారు.  Advertisement ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్…

రాష్ట్రంలో వరదలు వచ్చిన రెండు వారాలకి నారా లోకేష్.. ఎంట్రీ ఇచ్చారు. వస్తూ వస్తూనే వరి చేలో దిగి, అనుకూల మీడియాని వెంటేసుకుని హడావిడి చేశారు. 

ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై తన అక్కసునంతా వెళ్లగక్కి వెళ్లిపోయారు. ఈ హంగామా జరిగి వారం రోజులవుతోంది. మరి చినబాబు ఎక్కడ? జనాల్లోకి వచ్చిన లోకేష్ తిరిగి ట్విట్టర్ గూటికి చేరుకున్నారా?

టిడ్కో ఇళ్ల గురించి రాష్ట్రంలో ఇంత గందరగోళం జరుగుతోంది, టీడీపీ నాయకులు ఆక్రమించుకుంటాం, గృహప్రవేశాలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. 

మరి చినబాబు ఒక్క మాటకూడా మాట్లాడకుంటా ఎక్కడికి పోయారు? కనీసం రాష్ట్ర స్థాయి కమిటీలు ప్రకటించినప్పుడైనా బైటకు రాలేదు. కనీసం వారికి ట్విట్టర్ లో శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. అసలు లోకేష్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

వరదల సమయంలో లోకేష్ బైటకు రావడంతో.. టీడీపీ వర్గాల్లో కాస్తో కూస్తో సంతోషం ఏర్పడింది. చంద్రబాబు పూర్తిగా మొహం చాటేసినా లోకేష్ తమ కోసం వచ్చాడని అనుకున్నారు, దాచిపెట్టిన పచ్చజెండాలన్నీ బైటకు తీసి ఎగరేశారు. అయితే ఆ సంతోషం అంతలోనే ఆవిరైపోయింది. 

లోకేష్ మళ్లీ పరార్. లోకేష్ వాలకం చూస్తుంటే.. సినిమా హీరోలు షూటింగ్ కి హాజరైనట్టు ఉంటుందనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. 

స్టార్ట్ , కెమెరా, యాక్షన్ అనగానే.. లోకేష్ మాస్క్ తగిలించి అలా కారు దిగి కాలు బైటపెడతారని, ప్యాకప్ చెప్పగానే వెంటనే వెళ్లి కారులో కూర్చుంటారని, షూటింగ్ కి విరామం.. అంటే పరామర్శలకు విరామం ఇచ్చినప్పుడు అస్సలు అడ్రస్ లేకుండా పోతారనే అపవాదు ఆల్రడీ వచ్చేసింది.

రాజకీయాల్లో కమిట్ మెంట్ లేకపోయినా కంటిన్యుటీని కోరుకుంటారు ప్రజలు. ప్రతినిత్యం తమలో ఉండేవారిని, తమవారిగా ఆదరిస్తారు, అభిమానిస్తారు. 

అలాంటిది భావి నాయకుడిగా చెప్పుకుంటున్న లోకేష్ ఇంకా ఆ వాస్తవాలు గ్రహించలేదు. అందుకే ఒకరోజు జనంలో, మిగతా వారమంతా ట్విట్టర్లో కాలం గడుపుతున్నారు. ట్విట్టర్ పక్షి అనే ముద్రను చెరిపేసుకోవడం లోకేష్ కు ఇష్టం లేనట్టుంది. 

చంద్రబాబు బీజేపీని కూడా మేనేజ్ చేశారా?