టాలీవుడ్ లో సీనియర్ మేనేజర్ మహేంద్ర నిర్మాతగా మారుతున్నారు. ఆయనతో పాటు మరో మేనేజర్ కిరణ్ కూడా నిర్మాతగా మారారు. ఈ ఇద్దరు కలిసి హీరో సుధీర్ బాబుతో సినిమా చేయబోతున్నారు.
మహేంద్ర టాలీవుడ్ టాప్ హీరోయిన్లు చాలా మందికి మేనేజర్ గా వ్యవహారిస్తున్నారు. అలాగే కిరణ్ కూడా రష్మిక, కీర్తి శెట్టి, ఇంద్రగంటి, వెంకీ కుడుముల తదితరులకు మేనేజర్ గా వున్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరు మేనేజర్లు కలిసి ఇంద్రగంటి డైరక్షన్ లో సుధీర్ బాబు-కీర్తి శెట్టిల కాంబినేషన్ లో సినిమాను అనౌన్స్ చేసారు. ఇందుకోసం బెంచ్ మార్క్ స్టూడియోస్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసారు. గతంలో ఇంద్రగంటి అందించిన సమ్మోహనం టైపు క్లీన్ రొమాంటిక్ కామెడీ సబ్జెక్ట్ ను తీసుకుని సినిమా చేయబోతున్నారు.
వి సినిమా తరువాత ఇంద్రగంటి చేస్తున్న సినిమా ఇది. నిజానికి హీరో నాగ్ చైతన్యతో సినిమా చేయాలి. కానీ చైతూ విక్రమ్ కుమార్ సినిమా ఫినిష్ చేసి రావాల్సివుండడంతో, ఆ ఖాళీలో ఓ మీడియం సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు ఈ ప్రాజెక్టు సెట్ అయింది.