బాహుబలి ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ అందిస్తున్న భారీ వైవిధ్యమైన సినిమా ప్రాజెక్ట్ కేె. అశ్వనీదత్ నిర్మాత. ప్రభాస్ చేస్తున్న సిన్మాల్లో, సలార్, ప్రాజెక్ట్ కె రెండింటి మీదే ఫ్యాన్స్ ఫుల్ ఆశలు పెట్టుకుని వున్నారు. మిగిలిన సినిమాలు ఫ్యాన్స్ దృష్టిలో లాటరీ తప్ప వేరు కాదు.
ప్రాజెక్ట్ కె విడుదలకు ఇంకా చాలా సమయంలో వుంది. 2024లో విడుదలవుతుందీ సినిమా. ఈ లోగా సలార్ రెండు భాగాలు, ఆదిపురుష్ విడుదల కావాల్సి వుంది. ప్రాజెక్ట్ కె తరువాతే పీపుల్స్ మీడియా నిర్మించే సినిమా.
ఇంతకీ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే ప్రాజెక్ట్ కేె సినిమా నైజాం హక్కులను ఆసియన్ సునీల్ సారథ్యంలోని సిండికేట్ దక్కించుకుంది. సుమారు 70 కోట్లకు కాస్త దగ్గరగా నైజాం హక్కుల పంపిణీని ఈ సిండికేట్ తీసుకుంది. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖ నిర్మాతలు, సురేష్ బాబు-సునీల్ తో కలిసి ఆసియన్ గ్లోబల్ అనే పంపిణీ సిండికేట్ ను స్టార్ట్ చేసారు. గత ఏడాది సీతారామం, కార్తికేయ 2, ధమాకా లాంటి బ్లాక్ బస్టర్లను ఈ సిండికేట్ పంపిణీ చేసింది.
ఇప్పుడు ఇదే సిండికేట్ కు ప్రాజెక్ట్ కే హక్కులు కూడా దక్కాయి. ఒక్క నైజాం నే 70 కోట్లు అంటే ఆంధ్ర, సీడెడ్ ఏ మేరకు వుంటాయో అంచనా వేసుకోవచ్చు.