ప్రభాస్ ఫ్యాన్స్ ను నిలువునా నిరాశలో ముంచేసింది ప్రాజెక్ట్ కె నుంచి వచ్చిన హీరో ఫస్ట్ లుక్. ఆదిపురుష్ గ్లింప్స్ వచ్చినపుడు ప్రభాస్ మీద ఎంత ట్రోల్స్ నడిచాయో మళ్లీ ఇప్పుడు అంతకు రెట్టింపు. ఎందుకంటే ఈ సినిమా మీద ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. పైగా నాగ్ అశ్విన్ మీద నమ్మకం వుంది. ఇవన్నీ కలిసి పెంచిన ఆశలను ఆ ఫస్ట్ లక్ తుంచేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమీ మాట్లాడలేపోతున్నారు. యాంటీ ఫ్యాన్స్ ఓ లెక్కలో వేసుకుంటున్నారు.
ఇలాంటి టైమ్ లో మిగిలిన ఆశ అంతా ఈ రోజు/రేపు విడుదల అవుతున్న టీజర్ మీదే. నాగ్ అశ్విన్ వీడియో కంటెంట్ విషయంలో నిరాశ పర్చడు అనే నమ్మకం గట్టిగా వుంది. కానీ లుక్ విషయంలో ఎందుకిలా చేసాడు అన్నది జవాబు లేని ప్రశ్న.
హాలీవుడ్ సినిమా ప్రభావంతో ఈ సినిమా తయారు చేస్తున్నారని, కథ ఈ విధంగా వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చేసాయి. ఇప్పుడు వదిలిన లుక్ కూడా పరమ కాపీ అని ఉదాహరణలతో సహా బయటకు వచ్చింది. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వాళ్లు ఇన్స్పైర్ అయ్యాం అనే పదం వాడుతూ హాలీవుడ్ ను వాడేయడం గతంలో చూసాం. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ఇదే బాటన పడుతున్నాడా అనిపిస్తోంది.
జస్ట్ ఏదో గెటప్ వేయించి, ఫేస్ మాత్రం ఫొటో షాప్ చేసారని ట్రోల్ చేస్తున్నారు. బాహుబలి నాటి ప్రభాస్ అందం మళ్లీ మరోసారి చూపించేలా ఒక్క లుక్ రావడం లేదు. అది సాహో, రాధేశ్వామ్, ఆదిపురుష్ ఇలా ఏ సినిమా చూసినా. సలార్ ఫస్ట్ లుక్ ఒక్కటే మినహా. ఇలాంటి టైమ్ లో ప్రాజెక్ట్ కె టీజర్ ఓకె అయితే సరే లేదంటే.. ఇక ఫ్యాన్స్ పూర్తిగా మౌనంగా మారిపోవాల్సిందే.