పిఎస్ వన్ ఓ సర్ప్రయిజ్ ప్యాకేజ్. మన తెలుగు జనాలకు చోళులు..పల్లవుల గురించి అంతగా తెలియదు. చూసిన వాళ్లు చూసారు..చూడని వాళ్లు చూడలేదు. కానీ సినిమా మీద ఓ ఆసక్తి అయితే కొంత జనరేట్ అయింది.
ఇప్పుడు పిఎస్ 2 వస్తోంది. మొదటి సినిమా నేపథ్యంలో చోళులు, పల్లవుల మీద మీడియాలో చాలా సమాచారం వచ్చింది. దాంతో ఈసారి కొంత ఆసక్తి అయితే పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో పిఎస్ 2 ట్రయిలర్ వచ్చింది.
మళ్లీ కథ గురించి కాస్త గాభరా వుంటుంది. ఎందుకంటే పరిచయం తక్కువ వున్న చరిత్ర కనుక. కానీ ట్రయిలర్ అలా వదిలేయదు. కచ్చితంగా పిఎస్ 2 ను చూడాలి అనే ఆసక్తి కలిగిస్తుంది. అలా కలిగించేలా చేయడంలో దర్శకుడు మణిరత్నం విజన్ పూర్తిగా విజయవంతమైంది. బోలెడు మంది నటులు. వీరందరి పాత్రలూ పిఎస్ వన్ లో చూసేసాం. కానీ మళ్లీ ఏదో కొత్తగా చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగేలా చేసింది ట్రయిలర్.
విజువల్ ఎఫెక్ట్ లు కానీ, గెటప్ లు కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ, సిజి వర్క్ లు కానీ ఏ ఒక్కటీ ఏ వంకా పెట్టనంతగా వున్నాయి. రెహమాన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. సమస్య ఒక్కటే. పరిచయం కథతో అంతగా కనెక్ట్ కాలేకపోవడం. అయినా కూడా చూడాలనే ఆసక్తిని కలిగిస్తుంది ట్రయిలర్. అక్కడే వుంది దర్శకుడు మణిరత్నం టాలెంట్.