కొంప‌ముంచ‌నున్న పూన‌మ్ కౌర్‌

న‌టి పూన‌మ్ కౌర్ టాలీవుడ్‌లో వ‌ణుకు పుట్టిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య డైలాగ్ వార్ అనేక మ‌లుపులు తిరుగుతోంది. ప్ర‌ధానంగా పంజాబ్ న‌టి పూన‌మ్ కౌర్ కేంద్రంగా వైసీపీ తీవ్ర‌స్థాయిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై…

న‌టి పూన‌మ్ కౌర్ టాలీవుడ్‌లో వ‌ణుకు పుట్టిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య డైలాగ్ వార్ అనేక మ‌లుపులు తిరుగుతోంది. ప్ర‌ధానంగా పంజాబ్ న‌టి పూన‌మ్ కౌర్ కేంద్రంగా వైసీపీ తీవ్ర‌స్థాయిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై దాడి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో పూన‌మ్ కౌర్ తాజా ట్వీట్ జ‌న‌సేన‌లో, టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతోంది.

త్వ‌ర‌లో మౌనం వీడుతాన‌ని ఆమె ట్వీట్ చేయ‌డం చూస్తే ఆమె కొంప ముంచ‌నుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేపింది. పూన‌మ్ నోరు తెరిస్తే కొంద‌రు సినీ సెల‌బ్రిటీలు శాశ్వ‌తంగా నోరు మూయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయేమోన‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి పంజాబ్ న‌టికి ఓ సినీ ప్ర‌ముఖుడు అన్యాయం చేశాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై విస్తృతంగా చ‌ర్చిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

పూన‌మ్ తాజా ట్వీట్‌లో ప్ర‌కాశ్‌రాజ్‌పై ఆమె ప్ర‌శంస‌లు కురిపించ‌డం గ‌మ‌నార్హం. అలాగే చిల్ల‌ర రాజ‌కీయాల్లో ఆయ‌న త‌ల‌దూర్చార‌ని పేర్కొన‌డాన్ని ప్ర‌త్యేకంగా చూడాల్సిన అవ‌స‌రం ఉంది. పూన‌మ్ ట్వీట్ ఏంటంటే…

“మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక బరిలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ విజయం సాధించాలి. ప్రకాశ్‌రాజ్‌ నెగ్గితే… చాలారోజులుగా మౌనంగా ఉంటున్న నేను, పరిశ్రమలో ఎదుర్కొన్న సమస్యలకు ముగింపు పలుకుతా. ప్రకాశ్‌రాజ్‌ చిల్లర రాజకీయాల్లో తలదూర్చరు. రాజకీయాలకు అతీతంగా ఉండే ఏకైక వ్యక్తి ఆయ‌న‌.  పెద్దలపై గౌరవంతో వాళ్లు చెప్పింది శిరసావహిస్తా” అని ఆమె తెలిపారు.

త‌న కేంద్రంగా ఏపీలో సాగుతున్న రాజ‌కీయాల‌పై ఆమె న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఈ నెల 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని, ఆమె ట్వీట్ ప‌రోక్ష సంకేతాలు ఇస్తోంది. దీంతో ఆమె చేసే ప్ర‌క‌ట‌న ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందోన‌నే ఆందోళ‌న మాత్రం కొంద‌రు సెల‌బ్రిటీల‌లో లేక‌పోలేదు.