పూరి విజయానికి దగ్గరదారి ఇదేనా?

పూరి జగన్నాధ్. మాస్ మాటల మాంత్రికుడు. కానీ కథల విషయంలో సరైన శ్రద్ద పెట్టక సరైన సినిమాలు అందించి చాలా కాలం అయింది. ఇలాంటి నేపథ్యంలో రామ్ హీరోగా ఇస్టార్ట్ శంకర్ వచ్చింది. ఇద్దరు…

పూరి జగన్నాధ్. మాస్ మాటల మాంత్రికుడు. కానీ కథల విషయంలో సరైన శ్రద్ద పెట్టక సరైన సినిమాలు అందించి చాలా కాలం అయింది. ఇలాంటి నేపథ్యంలో రామ్ హీరోగా ఇస్టార్ట్ శంకర్ వచ్చింది. ఇద్దరు హీరోయిన్ల అందాలు, రామ్ ఎనర్జీ, మణిశర్మ పాటలు, ఆ పై పూరి మాస మాటలు. ఇవన్నీ కలిస్తే ఓ విజయం. కానీ పూరి ఆలోచన వేరుగా వున్నట్లుంది. అమ్మాయిల అందాలు స్క్రీన్ మీద పరిచేయడం వల్లనే హిట్ వచ్చిందని అనుకుంటున్నారేమో?

ఎప్పటి నుంచో కొడుకు ఆకాష్ కు సరైన హిట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫార్ములా అందుకుని, రొమాంటిక్ అనే సినిమాను తన చేతుల్లోకి తీసుకున్నారు.  అంతకు ముందు ఆ సినిమాకు కొత్త యువకుడు దర్శకుడిగా వున్నారు. కానీ ఎప్పుడయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిందో పూరి ఆ సినిమాను తన చేతుల్లోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ సినిమా తొలిపాటను విడుదల చేసారు. ఆకాష్ పూరి-కృతికశర్మ కాంబినేషన్ లో చిత్రీకరించిన ఈపాటలో ఫీల్ వుండొచ్చు. పూరి మార్కు పదాలతోనో, మాటలతోనో పాట వుండి వుండొచ్చు. కానీ అవేవీ చూసేవాళ్లకు పట్టవు. ఏ మేరకు అందాలు ఆరబోసారా? ఏ మేరకు భంగిమలు ప్రదర్శించారా? ఏ మేరకు ఎరోటిక్ కంటెంట్ అందించారా? అన్నదే చూస్తారు. వాట్సాప్ లో కట్ చేసి షేర్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది. 

వీలయితే బయ్యర్లు అడ్వాన్స్ లు పట్టుకుని క్యూ కట్టడానికి ఇంకా పనికి వస్తుంది. పూరి ఉద్దేశం కూడా అదే కావచ్చు.