పూరి..కొరటాల…పరుశురామ్

సర్కారు వారి పాట సినిమా విడుదలయింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అదంతా సరే, సినిమా చూస్తుంటే దాని మీద పూరి జగన్నాధ్, కొరటాల శివ లాంటి డైరక్టర్ల ప్రభావం వుందనిపిస్తుంది.  Advertisement పరుశురామ్…

సర్కారు వారి పాట సినిమా విడుదలయింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అదంతా సరే, సినిమా చూస్తుంటే దాని మీద పూరి జగన్నాధ్, కొరటాల శివ లాంటి డైరక్టర్ల ప్రభావం వుందనిపిస్తుంది. 

పరుశురామ్ మంచి రైటర్. ఆపై దర్శకుడు కూడా. అయితే తొలిసారి మహేష్ లాంటి పెద్ద హీరోతో చేస్తున్నాడు కనుక, గతంలో అదే హీరోతో చేసిన దర్శకుల సీన్లను ఓసారి అలా అలా గుర్తుకు తెచ్చుకున్నట్లుంది.

హీరో మహేష్

సర్కారు ప్రమోషన్లలో హీరో మహేష్ బాబునే చెబుతూ వచ్చారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పోకిరి క్యారెక్టర్ కు దగ్గరగా వుంటుందని. 

ఆ సంగతి ఎలా వున్నా హీరోయిన్ చూసి మైమరచిపోవడం, వెంటపడడం, విలన్లతో డీల్ చేసే పద్దతి ఇవన్నీ పూరి స్టయిల్ కు దగ్గరగా వుంటాయి. సినిమా క్లయిమాక్స్ ఫన్ ఎండింగ్ కూడా పూరి స్టయిల్ నే గుర్తుకుతెస్తుంది. 

హీరోయిన్ కీర్తి..

సాధారణంగా పరుశురామ్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్లకు ఓ ప్రత్యేకత వుంటుంది. అయితే అలా అని విచ్చలవిడితనం వుండదు. 

కానీ సర్కారు వారి పాటలో హీరోయిన్ క్యారెక్టర్ పరుశురామ్ హీరోయిన్ క్యారెక్టర్లకు భిన్నంగా వుంటుంది. పూరి స్టయిల్ లోకి పూర్తిగా మారిపోదు కానీ, కాస్త దగ్గరగా వుంటుంది.  

డైలాగులు

పరుశురామ్ చాలా మామూలుగా, మాట్లాడుకునే డైలాగులు రాస్తారు.కానీ వాటిలో డెప్త్ వుండేలా చూసుకుంటారు. కానీ సర్కారు సినిమాలో విచ్చలవిడిగా డబుల్ మీనింగ్ లు వాడేసారు. ఈ డైలాగులు అన్నీ పూరి ప్రభావమే అన్నట్లు వుంటుంది. 

ఉచ్చ…తడిసిపోతుంది…అంత పొడవు…వంగోబెట్టి… ఇలా చాలా వున్నాయి. అన్నింటికి మించి రాత్రికి ఉంచుకుని పంపిస్తా అని హీరో చేత అనిపించడం ఇదంతా పూరి ప్రభావమే అనుకోవాలి.

కొరటాల సీన్లు

సినిమాలో దర్శడుకు కొరటాల మార్కు సీన్లు కూడా కనిపిస్తాయి.. బ్యాంక్ కు రావడం, బ్రహ్మాజీ సీన్…హ్యాండీ కాప్డ్ ఎంప్లాయీ అందరి కన్నా ముందు చేయి ఎత్తి ముందుకు రావడం ఇదంతా కొరటాల స్టయిల్ అనిపిస్తుంది. అదే విధంగా కీ బంచ్ ల పట్టుకుని చేసిన ఫైట్, భరత్ అనే నేను సినిమాలో దుర్గా మహల్ ఫైట్ ను గుర్తుకు తెస్తుంది.

మొత్తం మీద మహేష్ కోసం వీళ్లంతా సాయం పట్టారా? లేక పరుశురామ్ వీళ్ల ప్రీవియస్ సినిమాలను గుర్తు చేసుకున్నాడా? అన్నది పక్కన పెడితే వాళ్ల స్టయిల్ మాత్రం గుర్తుకు వస్తుంది సినిమా చూసినపుడు.