Advertisement

Advertisement


Home > Politics - Opinion

'సర్కారు వారి పాట'పై పచ్చ మీడియా పైశాచికత్వం

'సర్కారు వారి పాట'పై పచ్చ మీడియా పైశాచికత్వం

రివ్యూలు రాసినా, అభిప్రాయాలు వెల్లడించినా వెబ్సైట్ల మీద విరుచుకుపడతారు సినీ జనం. చాంబర్ లో కూర్చుని డిస్కషన్స్ పెట్టుకుని, లేఖాస్త్రాలు సంధించి, వెబ్సైట్లపై ఉక్కుపాదం మోపుతున్నాం అంటూ నానా హడావిడీ చేస్తారు. 

కానీ మెయిన్ స్ట్రీం మీడియాగా పిలవబడే ఒకానొక ఛానల్ మాత్రం కర్కశంగా తమ రాజకీయ శునకానందం కోసం సినిమా విడుదలై ఒక షో పడగానే "సర్కారు వారి ఫ్లాపులు" అంటూ ఒక న్యూస్ రీల్ వదిలితే మాత్రం సినీ జనం కిమ్మనలేదు. నిజానికి "సర్కారు వారి పాట" నిర్మాతలు, హీరో, దర్శకుడు ఆ ఛానల్ ని ఖండించక్కర్లేదూ? వారికి నలుగురూ తోడు రానక్కర్లేదూ?

పోనీ ఇదేమైనా సినీ సమీక్షా అంటే కాదు. టికెట్ రేట్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గరకెళ్లినందుకు మహేశ్ బాబుపై కక్షకట్టి కక్కిన ద్వేషం మాత్రమే. 

జగన్ మోహన్ రెడ్డి వద్దకు టికెట్ల్ రేట్ల పెరుగుదల కోసం వెళ్ళిన వారి అందరి సినిమాలూ కట్టకట్టుకుని ఫ్లాపవుతున్నాయని, జగన్ దగ్గరకెళితే భస్మమే అని ఆ న్యూస్ చానల్ ప్రచారం చేయాలనుకుని డిసైడైపోయింది. 

ఇప్పటికే ప్రభాస్ "రాధేశ్యాం", చిరంజీవి "ఆచార్య" ఫ్లాపయ్యాయి కాబట్టి మహేశ్ బాబు "సర్కారు వారి పాట" కూడా ఫ్లాపవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని మొదటి ఆట పడగానే "అదిగో ఫ్లాప్" అంటూ ప్రకటించేసింది సదరు చానల్. 

మరి అదే మీటింగుకి రాజమౌళి కూడా వెళ్లాడుగా. ఆయన తీసిన ఆర్.ఆర్.ఆర్ బాగానే ఆడిందిగా. 

ముందు నుంచీ ఈ ఛానల్ కి వైసీపీ అన్నా, వైసీపీ నాయకులని నాయకులుగా చూసేవారన్నా కుళ్లే. ఆ కుళ్లుని మహేశ్ బాబు మీద కూడా వెదజల్లారు. 

ఎందుకంటే మహేశ్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ముందు నుంచీ తెదేపా వ్యతిరేకి. ఆయన లాయల్టీస్ ఎప్పుడూ కాంగ్రెస్ పక్షాన ఉండేవి. ఆయన కొడుకు కాబట్టి మహేశ్ ని ఎంత "మనోడు" అనుకుని లేపే అవకాశం ఉన్నా ఆ పని పెట్టుకోలేదు. మహేశ్ విషయంలో తటస్థ వైఖరి వషిస్తూ వచ్చింది పచ్చ మీడియా. కానీ ఎప్పుడైతే జగన్ ని కలిసి వచ్చాడో, తన "నేనున్నాను- నేనుంటాను" డయలాగ్ ని ఎప్పుడైతే హుందాగా తన సినిమాలో వాడాడో..ఇంకంతే.. మహేశ్ ఆ మీడియాకి శత్రువైపోయాడు. 

ట్రోలింగ్ వీరులకంటే ముందుగా బరిలోకి దూకి "సర్కారు వారి ఫ్లాపులు" ప్రోగ్రాం రన్ చేసిన ఘనత ఆ ఛానల్ దే. 

ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే పచ్చమీడియాకి చంద్రబాబే దేవుడు. తెదేపానే పార్టీ. ఒకానొక వర్గమే ప్రజలు. అందుకే ఇంతిలా దిగజారి మెయిన్ స్ట్రీం మీడియా అనే గౌరవాన్ని కూడా నిలబెట్టుకోకుండా "సర్కారు వారి పాట" పై విషం కక్కేసింది. తెలుగు సినీ రంగం మాత్రం పౌరుషాన్ని మడతపెట్టి ఎక్కడో దాచుకుని చోద్యం చూస్తూ కూర్చుంది. 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?