పుష్ప ఫస్ట్ వీకెండ్-రెండు చోట్ల రేట్ల ప్రభావం

కరోనా రెండు ఫేజ్ ల తరువాత వచ్చిన తొలి అత్యంత భారీ సినిమా పుష్ప. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో భయంకరమైన బజ్ తో విడుదలయిన ఈ సినిమా జర్నీ మిక్స్ డ్ టాక్ తో…

కరోనా రెండు ఫేజ్ ల తరువాత వచ్చిన తొలి అత్యంత భారీ సినిమా పుష్ప. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో భయంకరమైన బజ్ తో విడుదలయిన ఈ సినిమా జర్నీ మిక్స్ డ్ టాక్ తో ప్రారంభమైంది. తొలి వీకెండ్ మాత్రం మంచి ఫలితాలు నమోదు చేసింది. అయితే ఇటు నైజాం, అటు ఆంధ్రలో రెండు చోట్ల కూడా టికెట్ రేట్లు ప్రతి కూలంగా, అనుకూలంగా ప్రభావం చూపించడం విశేషం.

నైజాంలో కోర్టు అనుమతితో రేట్లు పెంచుకునే అవకాశం రావడంతో అక్కడ చాలా మంచి ఫలితాలు కనిపించాయి. 36 కోట్లకు మార్కెట్ అయిన సినిమాకు తొలి వీకెండ్ 28 కోట్ల షేర్ కనిపించింది. బాహుబలి 2 తరువాత ఇలాంటి ఫిగర్ కనిపించడం ఇదే.

ఆంధ్ర మొత్తం 48 కోట్లకు మార్కట్ చేసారు. అక్కడ ఫస్ట్ వీకెండ్ 28 కోట్ల మేరకు వసూళ్లు వచ్చాయి. నిజానికి నైజాంలో వున్న రేంజ్ లో కాకున్నా 150 టికెట్ రేట్ వున్నా, ఇంకా మంచి ఫిగర్లు కనిపించి వుండేవి.

మండే నుంచి ఎలా వుంటుంది అన్నదాన్ని బట్టి సినిమా సక్సెస్ రేంజ్ ఆధారపడుతుంది. 

తొలి మూడు రోజుల కలెక్షన్లు ఇలా వున్నాయి.

Nizam 28.5

Vizag 4.4

East 3.3

West 2.7

Krishna 2.75

Guntur 4.1

Ceded 8.5

Nellore 2.1

(Nizam area including GST)