ఇక్కడ కూడా 2 వారాలే.. గ్యాప్ సరిపోతుందా?

రెండు వారాల గ్యాప్ లో మరో 2 పెద్ద సినిమాలు రాబోతున్నాయి. పుష్ప-2, సరిపోదా శనివారం సినిమాలు కేవలం 2 వారాల గ్యాప్ లో రాబోతున్నాయి. పుష్ప-2కు ఈ గ్యాప్ సరిపోతుందా అనేది ఇక్కడ…

రెండు వారాల గ్యాప్ లో మరో 2 పెద్ద సినిమాలు రాబోతున్నాయి. పుష్ప-2, సరిపోదా శనివారం సినిమాలు కేవలం 2 వారాల గ్యాప్ లో రాబోతున్నాయి. పుష్ప-2కు ఈ గ్యాప్ సరిపోతుందా అనేది ఇక్కడ ప్రశ్న.

ఓజీ, దేవర విషయంలో కూడా ఇదే జరగబోతోంది. పవన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండగా.. 2 వారాలకే దేవర పార్ట్-1 వస్తోంది. సంక్రాంతి బరిలో కూడా ఇలాంటి ఓ పోటీ కనిపించబోతోంది.

ఓ పెద్ద సినిమాకు 2 వారాల గ్యాప్ సరిపోతుందా అంటే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ సినిమా 2 వారాలు ఆడితే అదే చాలా గొప్ప. కాబట్టి ఎంత పెద్ద సినిమాకైనా 2 వారాల థియేట్రికల్ రన్ సరిపోతుందనేది కొంతమంది వాదన.

మరికొంతమంది మాత్రం దీంతో ఏకీభవించరు. సినిమా హిట్టయితే 2 వారాలు ఏమాత్రం సరిపోవనేది వీళ్ల వాదన. హనుమాన్, సలార్ సినిమాల్ని దీనికి ఉదాహరణలుగా చూపిస్తున్నారు. ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు అదనంగా మరో 2 వారాల టైమ్ దొరికి ఉంటే మరిన్ని రికార్డులు సృష్టించి ఉండేది. కానీ అలా జరగలేదు. సంక్రాంతి సినిమాలు రాకతో సలార్ పడిపోయింది.

పుష్ప-2, ఓజీ సినిమాల విషయంలో కూడా ఇదే జరగబోతోందనే అనుమానాలున్నాయి. పుష్ప-2కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇలాంటి సినిమాను మినిమం 3 వారాలు పోటీ లేకుండా విడుదల చేసినట్టయితే బాగుండేది. బాలీవుడ్ మార్కెట్ సంగతి పక్కనపెడితే, కనీసం టాలీవుడ్ లోనైనా పోటీ లేకుండా ఏర్పాట్లు చేసుకోవాల్సింది. ఓజీ సినిమాకు కూడా ఇదే వర్తిస్తుంది.