బాహుబలి-2 ఫార్ములా ఫాలో అవుతున్న పుష్ప-2?

పుష్ప సినిమాను ఆసక్తికరంగా ముగించాడు దర్శకుడు సుకుమార్. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య జరిగే భీకరమైన సీన్ తో సినిమా ముగుస్తుంది. షెకావత్ కు అదిరిపోయే రేంజ్ లో వార్నింగ్ ఇస్తాడు పుష్ప.…

పుష్ప సినిమాను ఆసక్తికరంగా ముగించాడు దర్శకుడు సుకుమార్. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య జరిగే భీకరమైన సీన్ తో సినిమా ముగుస్తుంది. షెకావత్ కు అదిరిపోయే రేంజ్ లో వార్నింగ్ ఇస్తాడు పుష్ప. దీంతో పుష్పరాజ్ పై షెకావత్ పగ తీర్చుకోవడం, పుష్పరాజ్ దాన్ని ఎలా తిప్పికొట్టాడనేది పార్ట్-2లో బేసిక్ పాయింట్.

ఇప్పుడు దీనికి ఊతమిస్తూ, ఓ చిన్న పాయింట్ రివీల్ చేశారు మేకర్స్. సినిమాలో పుష్పరాజ్ అరెస్ట్ అవుతాడు, ఆ వెంటనే తప్పించుకుంటాడు. అతడికి బుల్లెట్ గాయాలు కూడా అవుతాయి. అయితే పుష్పరాజ్ ఎక్కడున్నాడనే విషయాన్ని ఎవ్వరూ కనిబెట్టలేకపోయారు. 'అసలు పుష్ప ఎక్కడ' అనే ఇంట్రెస్టింగ్ లాక్ తో వీడియోను ముగించారు.

దీనికి కొనసాగింపుగా మరింత సమాచారం కావాలంటే 7వ తేదీ సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ రోజున ఇంకొంచెం ఎక్కువ నిడివి ఉన్న వీడియోను విడుదల చేయబోతున్నారు.

చూస్తుంటే.. బాహుబలి-2 స్ట్రాటజీని పుష్ప-2 కోసం ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే హుక్ లైన్ ఆ సినిమాకు బాగా పనికొచ్చింది. అదే విధంగా “వేర్ ఈజ్ పుష్ప” అనే హుక్ లైన్ ను సోషల్ మీడియాలో వైరల్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టుంది.

పుష్ప సినిమా దేశవ్యాప్తంగా హిట్టయింది. యూత్ తో పాటు రాజకీయ నాయకులు, క్రికెటర్లు సైతం పుష్ప మేనరిజమ్స్, డైలాగ్స్ ను వాడుకున్నారు. అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు పార్ట్-2 అంటే ప్రచారం ఓ రేంజ్ లో ఉండాల్సిందే. దాని కోసం సరికొత్త ప్రచార ఎత్తుగడలు కావాల్సిందే.