Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప2 ఐటమ్ సాంగ్ చివరిలో

పుష్ప2 ఐటమ్ సాంగ్ చివరిలో

బన్నీ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు పుష్ప 2 సినిమా గురించి. ఆగస్ట్ 15న విడుదల పక్కా అని క్లారిటీ వస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో టీజర్ వస్తోంది. టీజర్ ఎలాగూ బాగుంటుంది. ఎందుకంటే అక్కడ వున్నది సుకుమార్, బన్నీ. ఏమాత్రం అయినా సుకుమార్ తగ్గచ్చు ఏమో కానీ, బన్నీ మాత్రం తన సినిమా కంటెంట్, క్వాలిటీ విషయంలో తగ్గేదే లే అన్నట్లు వుంటాడు. అందువల్ల టీజర్ గురించి వెయిటింగ్ నే తప్ప సందేహాలు లేవు

అయితే పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ వుందా లేదా అంటే పక్కాగా, కచ్చితంగా వుంటుంది. కానీ ఇప్పటి వరకు దీని మీద దృష్టి పెట్టలేదట టీమ్. పుష్ప వన్ లో కూడా లాస్ట్ మినిట్ లో పిక్చరైజ్ చేసారట, సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన..’ఊ అంటారా..’ పాటను. అందువల్ల ఇప్పుడు కూడా జూన్ చివరిలో లేదా జూలై తొలివారంలో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

హీరో బన్నీ వర్క్ మాత్రం పుష్ప 2 కు సంబంధించి మే నెలాఖరుకు పూర్తయిపోతుందట. జూన్ లో బ్యాలన్స్ వర్క్ ఫినిష్ చేస్తారట. సిజి లకు సంబంధించి పెద్దగా టెన్షన్ లేదని, సినిమాలో మరీ అంత సిజి వర్క్ ఏమీ లేదని నిర్మాణ వర్గాల బోగట్టా. అందువల్ల సినిమా ఆగస్టు 15న రావడానికి ఏ సమస్యలు లేవని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇంతకీ ఐటమ్ సాంగ్ కు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, సమంత పేరుతో సహా. ఎవరై వుంటారో.. ఆ కిక్ ఎలా వుంటుందో. ఎందుకంటే సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్ లు, వాటికి దేవీ ఇచ్చే ట్యూన్ లు.. అదంతా సమ్ థింగ్ మోర్ కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?