Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప కు గ్రౌండ్ రియాల్టీ తెలియాలి

పుష్ప కు గ్రౌండ్ రియాల్టీ తెలియాలి

పుష్ప సినిమా పెద్ద హిట్. పుష్ప 2 నుంచి వచ్చిన టీజర్‌కు మిశ్రమ స్పందన. ఎందుకిలా? కేవలం టీజర్ యావరేజ్ గా వున్నందునేనా? కానే కాదు. పుష్ప సినిమా అసలు ఎందుకు హిట్ అన్నది కేవలం బన్నీ యాంగిల్ లోనే చూడడం వల్ల.

పుష్ప సినిమాను మొదటి రోజు తెలుగునాట యునానిమస్ గా రిసీవ్ చేసుకోలేదన్నది వాస్తవం. కానీ తరువాత.. తరువాత మెల్లగా పుంజుకుంది. అమ్మిన రేట్లకు బ్రేక్ ఈవెన్ కాలేదు కానీ, జీఎస్టీలతో దగ్గరకు వెళ్లింది.

పుష్ప హిట్ కావడానికి కేవలం బన్నీ క్రేజ్, సుకుమార్ సృష్టించిన అద్భుతం ఒక్కటే కాదు. ముఖ్యంగా నార్త్ మాస్ బెల్ట్ లో ఆడింది అంటే సమంత చేసిన ఊ అంటావా మామా.. పాట ఎక్కువ కారణం. ఆ ఐటమ్ సాంగ్ అటు నార్త్ లోనూ, ఇటు సౌత్ లోనూ భయంకరంగా వైరల్ అయిపోయింది. ఆపైన తగ్గేదేలే అన్న దాన్ని సోషల్ మీడియాలో చాలా తెలివిగా పాపులర్ చేయించడం కొంత వరకు పనికి వచ్చింది. పాజిల్ ఫ్యాక్టర్ యాడ్ అయింది.

ఇప్పుడు టీజర్ కేవలం బన్నీ చుట్టూ తిరిగింది. బన్నీ లేడీ గెటప్, డ్యాన్స్, ఫైట్ మాత్రమే అందులోకి తీసుకువచ్చారు. ఓ డైలాగు లేదు. కౌంటర్ కు ఎన్ కౌంటర్ అన్నట్లుగా ఫాజిల్ ను తీసుకురాలేదు. మరి టీజర్ మీద ఏం ఆసక్తి వుంటుంది. కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే కొంత వరకు పడుతుంది. మిగిలిన వారికి రుచించదు. అందుకే పుష్ప 2 టీజర్ కు రావాల్సినంత క్రేజ్ రాలేదు.

పుష్ప అనేది కలెక్టివ్ సక్సెస్. సమంత.. దేవీశ్రీ ప్రసాద్… బన్నీ.. సుకుమార్… అదే విధంగా ఇప్పుడూ ముందకు వెళ్తే అదే సెన్సేషన్ పాజిబుల్ అవుతుంది. కానీ సినిమాలో అవన్నీ చూసుకుంటాం.. పబ్లిసిటీ మాత్రం హీరో చుట్టూనే తిరగాలి అనుకుంటున్నట్లుంది యూనిట్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?