ఆంధ్రలో తక్కువ రేట్ల టైమ్ లో విడుదలయింది పుష్ప. సినిమా కంటెంట్ కావచ్చు, బన్నీ యాక్టింగ్ కావచ్చు. డైలాగులు కావచ్చు. అన్నింటికి మించి సమంత సాంగ్ కావచ్చు. జనాలు బాగానే చూసారు. పైగా సినిమాకు నాలుగు వారాల పాటు ఎదురులేని వెసులుబాటు దొరికింది.
అలాంటి సినిమా ఉత్తరాంధ్రలో ఏడు కోట్లు దాటి వసూలు చేయడం కష్టం అయింది. నెల్లూరులో మూడు కోట్లు దాటి వసూలు చేయడం కష్టం అయింది.
ఆర్ఆర్ఆర్ కు ఇప్పుడు రేట్లు వచ్చాయి. ఇద్దరు హీరోలు, రాజమౌళి పేరు యాడ్ అయింది. భారీ రేట్లకు అమ్మేస్తారు. అందులో సందేహం లేదు. అయినా కూడా మూడు రెట్లు రావాల్సి వుంది.
అంటే ఉత్తరాంధ్రలో పుష్ప ఏడు కోట్లకు పైగా చేస్తే, ఆర్ఆర్ఆర్ 25 కోట్లు వసూలు చేయాలి. నెల్లూరులో పుష్ప మూడు కోట్లకు పైగా వసూలు చేస్తే ఆర్ఆర్ఆర్ 10 కోట్లు వసూలు చేయాల్సి వుంటుంది.
ఇండస్ట్రీ బిజినెస్ సర్కిళ్లలో ఇప్పుడు ఇదే డిస్కషన్ పాయింట్ గా వుంది. అదృష్టం కొద్దీ ఫ్యాన్స్ షో లు ఆంధ్రలో అయిదు వందల నుంచి వెయ్యి రూపాయల మేరకు అమ్ముడు పోయాయి. ఫిక్స్ డ్ హయ్యర్లు పెద్దగా అన్ని చోట్లా పడలేదు కానీ మినిమమ్ గ్యారంటీలు గట్టిగానే పడ్డాయని టాక్ వుంది.
మొత్తం మీద వ్యవహారం ఎలా వుంటుందో చూడాలి.