ఇవాళ హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉండి అధికారం పంచుకున్న కూడా ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించలేకపోయారంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. అలాగే ఎన్టీఆర్ కుమారై పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించడం కోసం ప్రయత్నించాలని.. కేవలం రూ. 100 కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ పెట్టించడంతో సరిపోదని సూచించారు.
ఆర్ నారాయణ మూర్తి సభలో మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన కేవలం ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీతో ఢీ కొట్టి తెలుగు వారి సత్తా చూపించారని.. ఎంజీఆర్ కు భారతరత్న ఇచ్చారు కానీ ఆయన కంటే గొప్ప వ్యక్తి అయిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలేదని.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గట్టిగా పోరాటం చేయల్సిందని… ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు సినీ పరిశ్రమ కూడా పోరాడాలని వేడుకున్నారు.
కాగా కేవలం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటారని.. అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేరు కూడా ఎక్కడ ఎత్తకుండా రాజకీయం చేస్తారనే సంగతి అందరికి తెలిసిందే. ఎంతో మందిని రాష్ట్రపతులు, ప్రధానమంత్రులను చేసానంటూ చెప్పుకునే చంద్రబాబు సొంత మామకు భారతరత్న ఇప్పించలేకపోవడం వెనుక కారణాలు ఏంటో ఆయనకే తెలియలి మరీ.