రానా – మరో భారీ సినిమా

విరాటపర్వం సినిమా నిర్మాణంలో వుంది. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ డిస్కషన్ స్టేజ్ లో వుంది. హిరణ్య కశిప సినిమా ప్రిపరేషన్ లో వుంది. ఇవన్నీ ఇలా వుండగానే హీరో రానా మరో సినిమాకు సైన్…

విరాటపర్వం సినిమా నిర్మాణంలో వుంది. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ డిస్కషన్ స్టేజ్ లో వుంది. హిరణ్య కశిప సినిమా ప్రిపరేషన్ లో వుంది. ఇవన్నీ ఇలా వుండగానే హీరో రానా మరో సినిమాకు సైన్ చేసేసాడు. సురేష్ మూవీస్ బ్యానర్, మరో నిర్మాత ఆచంట గోపీనాథ్ కలిపి ఈ సినిమాను నిర్మిస్తాయి.

తెలుగు, తమిళ భాషల్లో కాస్త భారీగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు మిళింది రావ్ దర్శకత్వం వహిస్తారు. గతంలో ఆయన గృహం వంటి సినిమా తో ప్రశంసలు పొందారు. ఈసారి రానాతో తీయబోయే సినిమా యాక్షన్ అడ్వంచరస్ లైన్ లో వుంటుంది. పైగా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కాస్త ఎక్కువే వుంటుంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు అన్నది ఇంకా తెలియదు. ఎందుకంటే విరాటపర్వం తరువాత అయ్యప్పన్ రీమేక్ వుంటే మాత్రం ఈ సినిమా దాని తరువాత వుండే అవకాశం వుంది. 

V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు