దేశాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు శిక్ష

కోర్టు ధిక్క‌ర‌ణ కేసు విష‌య‌మై సుప్రీంకోర్టు ప్ర‌సిద్ధ లాయ‌ర్ ప్ర‌శాంత్‌భూష‌ణ్‌కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం విధించే శిక్ష విష‌య‌మై ఉత్కంఠ‌కు ఎట్టకేల‌కు తెర‌దించారు. సుప్రీంకోర్టు ఆయ‌న‌కు శిక్ష ఖ‌రారు చేసింది. అయితే అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా…

కోర్టు ధిక్క‌ర‌ణ కేసు విష‌య‌మై సుప్రీంకోర్టు ప్ర‌సిద్ధ లాయ‌ర్ ప్ర‌శాంత్‌భూష‌ణ్‌కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం విధించే శిక్ష విష‌య‌మై ఉత్కంఠ‌కు ఎట్టకేల‌కు తెర‌దించారు. సుప్రీంకోర్టు ఆయ‌న‌కు శిక్ష ఖ‌రారు చేసింది. అయితే అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఆ శిక్ష ఉంది. కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన నేరం కింద ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు సుప్రీంకోర్టు కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

ఈ మొత్తాన్ని సెప్టెంబ‌ర్ 15వ తేదీలోపు కోర్టుకు డిపాజిట్ చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక‌వేళ రూపాయి డిపాజిట్ చేయ‌క‌పోతే మూడు నెల‌ల జైలు శిక్ష‌, మూడేళ్ల పాటు ప్రాక్టీస్‌ను నిషేధం విధిస్తామ‌ని తీర్పులో సుప్రీంకోర్టు హెచ్చ‌రించింది. సుప్రీంకోర్టు జడ్జిలు, కోర్టులపై భూషణ్ చేసిన ట్వీట్లను సుమోటోగా స్వీకరించి కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ప్రశాంత్‌ భూషణ్‌ను దోషిగా తేలుస్తూ ఆగస్టు 14న సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించింది.  క్షమాపణ చెప్పేందుకు నాలుగురోజుల సమయం ఇచ్చింది. కానీ, ప్రశాంత్ భూషణ్ మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించ‌డ‌మే కాకుండా మ‌రింత ఘాటైన లేఖ స‌మ‌ర్పించారు. దీంతో ఈ నెల  25న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, నేడు శిక్ష ఖరారు చేసింది. మ‌రి రూపాయి జ‌రిమానా విధిస్తారా? లేక జైలుకు వెళుతారా? అనేది మ‌రో రెండు వారాల్లో తేల‌నుంది.

V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు