రాధేశ్యామ్ ఫస్ట్ వీక్.. డిజాస్టర్ ఫిక్స్

మొన్నటివరకు అనుమానాలుండేవి. ఏదైనా అద్భుతం జరగొచ్చనే ఆశలు కూడా కొంతమందికి ఉండేవి. కానీ అవేం జరగలేదు. రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ అయింది. మొదటివారం 80శాతం బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా, నాలుగో రోజు…

మొన్నటివరకు అనుమానాలుండేవి. ఏదైనా అద్భుతం జరగొచ్చనే ఆశలు కూడా కొంతమందికి ఉండేవి. కానీ అవేం జరగలేదు. రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ అయింది. మొదటివారం 80శాతం బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా, నాలుగో రోజు నుంచే చతికిలపడింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. పక్కా డిజాస్టర్ అనిపించుకుంది.

ఏపీ, నైజాంలో ఈ వారం రోజుల్లో రాధేశ్యామ్ సినిమా 55 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను వంద కోట్ల రూపాయలకు పైగా (హయ్యర్స్ తో కలిపి) అమ్మారు. ఆ మొత్తం వెనక్కు రావడం అసంభవం అని తేలిపోయింది. ఫలితంగా రాధేశ్యామ్ సినిమాకు ఏపీ, నైజాంలో 40 కోట్లకు పైగా నష్టం తప్పేలా లేదు. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు 15 కోట్ల నష్టం వచ్చేలా ఉంది.

అటు నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. ఈ వారం రోజుల్లో వసూళ్లు అటుఇటుగా 20 కోట్ల రూపాయలు వచ్చాయంటే సినిమా రిజల్ట్ ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ రాధేశ్యామ్ కంటే కశ్మీర్ ఫైల్స్ సినిమా బాగా ఆడుతోంది.

సౌత్ లో చూసుకుంటే తమిళ్, మలయాళం, కన్నడ రీజియన్స్ లో కూడా రాధేశ్యామ్ ఫెయిల్ అయింది. ఉన్నంతలో ఓవర్సీస్ లో ఈ సినిమా రన్ బాగున్నప్పటికీ, ప్రస్తుతం అక్కడ కూడా డల్ అయింది. రేపు, ఎల్లుండి వచ్చే వసూళ్లతో రాధేశ్యామ్ ఫైనల్ రన్ ముగిసే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆ వచ్చే వారం ఆర్ఆర్ఆర్ సినిమా వస్తోంది.

మరోవైపు ఈ సినిమాకు థియేటర్స్ కౌంట్ కూడా తగ్గిపోయింది. ఈరోజు 4 చిన్న సినిమాలతో పాటు రాజ్ తరుణ్ నటించిన స్టాండప్ రాహుల్ కూడా థియేటర్లలోకి రావడం, మరోవైపు భీమ్లానాయక్ కు ఇంకా థియేటర్లు కొనసాగించడంతో.. ఆ మేరకు రాధేశ్యామ్ కొన్ని థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది. రెండో వారంలో ప్రభాస్ మూవీకి ఏపీ, నైజాంలో స్క్రీన్స్ సంఖ్య 500కు పడిపోయింది.