సినిమా కూడా నది లాంటిదే. ఎక్కడో పుట్టి…ఎక్కడో పెరిగి…ఎక్కడికో చేరుతుంది. చాలా సినిమాల కథలు ఎక్కడో పుట్టి..ఎవరి దగ్గరకో చేరి, ఇంకెక్కడికో వెళ్లి..ఆఖరికి మరెక్కడో సెటిల్ అవుతాయి.
త్వరలో విడుదల కాబోతున్న రాధేశ్వామ్ వ్యవహారం కూడా అచ్చం ఇలాంటిదే అని తెలుస్తోంది. ఈ సినిమా కథ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ది కాదట. ఈ కథను తయారు చేసింది దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.
చిత్రమైన కథలు రాసుకుంటారు ఆయన. అలాగే ఆయన పామిస్ట్రీ అన్న పాయింట్ కీలకంగా ఈ కథ తయారుచేసుకున్నారు. దాన్ని తొలుతగా తీసుకెళ్లింది హీరో వెంకటేష్ దగ్గరకు. అప్పటికి ఇది లవ్ స్టోరీ కీలకంగా కాదు.
పామిస్ట్రీనే కీలకం. అయితే ఎందుకో వెంకీకి ఈ స్క్రిప్ట్ సెకండాఫ్ మీద పెద్దగా పాజిటివ్ ఒపీనియన్ రాలేదని తెలుస్తోంది. దాంతో ఆయన సారీ చేయలేనని చెప్పేసారు. సురేష్ కాంపౌండ్ అంతే. స్క్రిప్ట్ విషయంలో చాలా పట్టుదలగా వుంటుంది.
ఆ తరువాత మరి ఎందుకో తెలియదు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఆ కధను అమ్మేసారు. ఆ తరువాత ఆ కథలోకి పామిస్ట్రీతో సమానంగా లవ్ స్టోరీ వచ్చి చేరింది. పాన్ ఇండియా సినిమాగా మారింది. ఏ కథ ఎవరికి ప్రాప్తమో..మరి.