జ్యోతిక‌పై రాధిక పొగ‌డ్త‌లు…తెలిస్తే మ‌నం కూడా!

త‌మిళ నటి జ్యోతిక‌ను సీనియ‌ర్ న‌టి రాధికా శ‌ర‌త్‌కుమార్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. కార‌ణం తెలిస్తే మ‌నం కూడా త‌ప్ప‌కుండా ఆమెని అభినందించ‌కుండా ఉండ‌లేం. జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌లో పొన్న‌గ‌ల్ వందాల్ చిత్రం తెర‌కెక్కింది. ఈ…

త‌మిళ నటి జ్యోతిక‌ను సీనియ‌ర్ న‌టి రాధికా శ‌ర‌త్‌కుమార్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. కార‌ణం తెలిస్తే మ‌నం కూడా త‌ప్ప‌కుండా ఆమెని అభినందించ‌కుండా ఉండ‌లేం. జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌లో పొన్న‌గ‌ల్ వందాల్ చిత్రం తెర‌కెక్కింది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు కె.భాగ్య‌రాజ్‌. పార్దిబ‌న్‌, పాండ్య‌రాజ‌న్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని  2–డీ ఎంటర్‌టైనర్‌ పతాకంపై జ్యోతిక భ‌ర్త సూర్య నిర్మించారు.

లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో సినిమా విడుద‌ల‌కు నోచుకోలేదు. అయితే ఇప్ప‌టికే విడుద‌ల‌లో జాప్యాన్ని దృష్టిలో పెట్టుకున్న నిర్మాత సూర్య ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌ల చేయాల‌ని సూర్య నిర్ణ‌యించుకున్నారు. ఈ నిర్ణ‌యం థియేట‌ర్ల య‌జ‌మానులు, నిర్మాత‌ల మ‌ధ్య గొడ‌వ‌కు దారి తీసింది. భ‌విష్య‌త్‌లో సూర్య తీసే సినిమాల‌ను విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని థియేట‌ర్ల య‌జ‌మానులు క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు ఈ నెల 29న అమెజాన్‌ ప్రైమ్‌ టైమ్ లో సినిమా విడుద‌ల‌కు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆన్‌లైన్‌లో మీడియా ప్ర‌తినిధుల‌తో చిత్ర విశేషాల‌ను జ్యోతిక పంచుకున్నారు. త‌మిళంలో స్ప‌ష్టంగా మాట్లాడ్డం ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను, అభిమానుల‌ను మంత్ర‌ముగ్ధుల్ని చేసింది. ఈ సంద‌ర్భంగా త‌ప్పుల్లేకుండా అచ్చ త‌మిళ వ్య‌క్తిలా మాట్లాడిన జ్యోతిక‌ను రాధిక పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

ఆత్మవిశ్వాసంతో చాలా స్పష్టంగా తమిళంలో మాట్లాడటాన్ని అభినందిస్తున్నట్లు రాధిక ట్వీట్ చేశారు. రాధికా ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం అవుతోందని అన్నారు. ఉత్తరాది నుంచి వచ్చి ఎంతో అంకిత భావంతో పని చేస్తున్న ఏకైక నటి జ్యోతిక అని రాధికా శరత్‌ కుమార్‌ అభినందించారు.

కాగా  త‌మిళుల‌కు భాషాభిమానం మెండు. అందువ‌ల్ల త‌మిళంలో జ్యోతిక మాట్లాడ్డాన్ని వాళ్లు గొప్ప‌గా భావిస్తున్నారు. ముంబ‌య్‌లో చందర్ సదానా, సీమా సదానా దంపతులకు జ్యోతిక జ‌న్మించారు. ఆమె తండ్రి సినీ నిర్మాత‌. వాళ్ల‌ది పంజాబీ కుటుంబం. 2006లో త‌మిళ హీరో, నిర్మాత సూర్య‌ను జ్యోతిక వివాహం చేసుకున్నారు.  

దేవుడి ఆస్తులను కాజేసింది చంద్రబాబు