స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అంటే మహాపరాధానికి పాల్పడినట్టు కొందరు తెగబాధపడి పోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఉన్నారు. బాబుకు సంఘీభావంగా ఆయన చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో సెటైర్స్ విసురుతున్నారు.
“చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి” అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.
బాబును అరెస్ట్ చేయడంతో అంబేద్కర్ విగ్రహాలు బాధ పడడం సంగతేమో గానీ, ఎన్టీఆర్ విగ్రహాలు మాత్రం ఆనంద భాష్పాలు రాల్చుతున్నాయని నెటిజన్లు రాఘవేంద్రరావుకు చెంప చెళ్లుమనేలా కౌంటర్లు స్టార్ట్ చేయడం విశేషం. గతంలో వైశ్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, ఆయన్ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం గుర్తు రాలేదా? అని రాఘవేంద్రరావును నెటిజన్లు నిలదీశారు.
తన కష్టార్జితంపై అధికారాన్ని తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి, అన్యాయంగా చంద్రబాబు గద్దెనెక్కినప్పుడు మీరు హీరోయిన్ల బొడ్లపై పండ్లు చల్లుతూ ఆడుకుంటున్నారా? అని చాకిరేవు పెడుతున్నారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకుని, వారిలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగబద్ధమేనా రాఘవేంద్రరావు అంటూ నెటిజన్లు బొడ్డు దర్శకుడికి చీవాట్లు పెట్టడం ఆకట్టుకుంటోంది.