సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై స్ఫష్టంగా స్పందించే నటి పూనమ్ కౌర్. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరపై నర్మగర్భ ట్వీట్ లు కూడా వేస్తుంటుంది. అది వేరే సంగతి.
ఇప్పుడు పూనమ్ కౌర్ మళ్లీ ఒక్కసారిగా వార్లల్లోకి వచ్చింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పూనమ్ ప్రత్యక్ష మయింది. అంతే కాదు తెల్లటి చేనేత చీరలో మెరిసిపోతూ రాహుల్ గాంధీ కి తెలంగాణ చేనేత కార్మికుల సమస్యలను వివరిస్తూ ఫొటోలకు చిక్కింది.
ఈ పొటోల్లో రాహుల్ చేతిలో చేయి వేసి పట్టుకుని మరీ నడక సాగించడం విశేషం. రాహుల్ గాంధీ యాత్ర మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వైపు సాగుతుండగా పూనమ్ వచ్చి యాత్రలో జాయిన్ అయ్యారు. చేనేత కార్మికుల స్థితిగతులపై పూనమ్ కు మంచి అవగాహ వుంది. సోనియాను కూడా కలవాలని రాహుల్ సూచించినట్లు వార్తలు వచ్చాయి.
ఆ విషయం ఎలా వున్నా వైట్ అండ్ వైట్ డ్రెస్ ల్లో రాహుల్..పూనమ్ చేతులు కలిపి నడుస్తున్న స్టిల్స్ మాత్రం సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.