అనుభవించు రాజా అంటూ రాజ్ తరుణ్ తో సినిమా నిర్మించేసారు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతలు. శ్రీను గవిరెడ్డి దర్శకుడు.
గతంలో సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు అనే సినిమా రాజ్ తరుణ్ తోనే చేసాడు.ఇది రెండో సినిమా. ఈ సినిమా టీజర్ ప్రామిసింగ్ కనిపించిన నేపథ్యంలో ట్రయిలర్ ను విడుదల చేసారు.
ఊళ్లో మైనర్ బాబు మాదిరిగా చెలరేగిపోయిన కుర్రాడు నగరానికి షిప్ట్ అయిన తరువాత సెక్యూరిటీ గార్డుగా మారిపోవడం, ప్రేమలో పడిపోవడం ఓ లైన్, అలాగే పల్లెటూరు సరదాలు, పంతాలు, పట్టుదలలు మరో లైన్. ఈ రెండూముడిపెట్టి కథ అల్లినట్లు కనిపిస్తోంది.
అల్లరి నరేష్ సినిమాల మాదిరిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ టచ్ తో ట్రయిలర్ కనిపిస్తోంది. ఆ పాత్రకు పక్కా ఫిట్ అయిపోయాడు రాజ్ తరుణ్. పెద్దగా పంచ్ లు పేలకపోయినా, టేకింగ్ మొత్తం కామెడీ లైన్ లోనే వెళ్లింది. ఈనెల 26న సోలోగా బరిలోకి దిగుతోందీ టేబుల్ ప్రాఫిట్ మూవీ.