రాజ‌మౌళి సినిమాలు..రొమాంటిక్ పాటలు

దర్శకుడు కే రాఘవేంద్రరావు శిష్యుడు ఎస్ఎస్ రాజ‌మౌళి. తెలుగు సినిమాల్లో రాఘవేంద్రరావు పాటలు, వాటి వ్యవహారం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాటల్లో హీరోయిన బొడ్టును ఓ ప్రాపర్టీగా మార్చేసిన దర్శకుడు ఆయన. హీరోయిన్ బొడ్డుపై ఆయన…

దర్శకుడు కే రాఘవేంద్రరావు శిష్యుడు ఎస్ఎస్ రాజ‌మౌళి. తెలుగు సినిమాల్లో రాఘవేంద్రరావు పాటలు, వాటి వ్యవహారం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాటల్లో హీరోయిన బొడ్టును ఓ ప్రాపర్టీగా మార్చేసిన దర్శకుడు ఆయన. హీరోయిన్ బొడ్డుపై ఆయన నానా ప్ర‌యోగాలు చేసారు. కానీ అవన్నీ చాలా కళాత్మకంగా, ఆయనో రసిక శిఖామణిగా చుట్టూవున్నవారు భజ‌న చేస్తూ సాగిన అనేక కార్యక్రమాలు వున్నాయి. 

సరే అది వేరే సంగతి. ఆయన శిష్యుడు రాజ‌మౌళి కూడా తక్కువేం కాదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే దేశభక్తి కలగలిపిన సినిమా తీసి వుండొచ్చు కానీ మొదటి నుంచీ ఆయన సినిమాల్లో అటు మాటల్లో ఇటు పాటల్లో ఈ తరహా రసికత తొంగి చూస్తూనే వుంది. ఆయన సినిమాల విజ‌య రహస్యం వెనుక అదీ దాగి వుంది.

తొలి సినిమా 'స్టూడెంట్ నెం 1' నిర్మాత రామోజీరావు. అందువల్ల ఆయన ఒప్పుకుని వుండకపోవచ్చు. కానీ మలి సినిమా 'సింహాద్రి'లో రమ్యకృష్ణ ను తీసుకువచ్చి, ఎన్టీఆర్ చేత బీర్ బాటిల్ ఆమె శరీరంపై ఎక్కడెక్కడో తిప్పి, ‘చిన్నదమ్మే చీకులు కావాలా’ అంటూ చేయించిన విన్యాసాలు మామూలుగా వుండవు.

నితిన్ హీరోగా రెడీ అయిన 'సై' సినిమాలో ఓ పడుచు హీరోయిన్ (జెనీలియా) బుజ్జైనా,చంటైనా,,ఎవరైనా సై..సై అంటూ హొయలుపోతూ, తనకు ఎవరైనా ఒకటే అనే గొప్ప సందేశం ఇస్తూ సాగిన పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ప్రభాస్ తో చేసిన 'ఛత్రపతి'లో గుండు సూది పాటలో శ్రేయ ను హీరో ఎక్కడ పట్టుకున్నదీ పాట ప్రారంభంలోనే ప్రదర్శిస్తారు. ఆ పాట అంతా డబుల్ మీనింగ్ లే. ఇక ఆ సినిమాలో ఐటమ్ సాంగ్..మన్నేల తింటివిరా కృష్ణా అంటూ ‘అమ్మా మన్ను తినంగ’ అనే అధ్భుత భాగవత పద్యాన్ని సమూలంగా ఎగతాళి చేసారు. జ‌నం అబ్బో..రాజ‌మౌళి క్రియేటివిటీ అని లొట్టలు వేసారు. కానీ మా పురాణ పద్యాన్ని ఎగతాళి చేస్తారా? మా కృష్ణుడిని ఐటమ్ సాంగ్ లోకి తెస్తారా? అని అస్సలు కన్నెర్ర చేయలేదు.

'విక్రమమార్కుడు' సినిమాలో వస్తవా..వస్తవా..వాటమైనది ఇస్తవా…అంటూ ఆ వాటమైనది ఏంటో చెప్పకనే చెప్పారు.

'యంగదొంగ' సినిమాలో పురాణపాత్రలనే అపహాస్యం ఏ మేరకు చేసారో తెలిసిందే. రంభ ఊర్వశి మేనక కలిసి యంగ్ యమ..యంగ్ యమ అంటూ ఎన్టీఆర్ తో కలిసి వేసిన చిందులు రాజ‌మౌళి ప్రతిభకు మచ్చుతున్నక.

'మగధీర' సినిమాలో నానేటి సెప్పను..నేనేటి సెయ్యను అంటూ ఉత్తరాంధ్ర మాండలీకంలో ఐటమ్ సాంగ్ రంగరించి వదిలారు.

'బాహుబలి' వన్ లో మనోహరి సాంగ్ అల్టిమేట్. ముగ్గురు అయిటమ్ అందగత్తెలు ప్రదర్శించిన భంగిమలు మామూలుగా వుండవు

రాజ‌మౌళి వదిలేసింది కేవలం 'ఈగ'..'మర్యాదరామన్న' సినిమాలు మాత్రమే. అక్కడ స్పేస్ లేకపోయివుండొచ్చు.

పురాణపాత్రలను, పద్యాలను అపహాస్యం చేయడం, శృంగార గీతాలు రంగరించడం రాజ‌మౌళి సినిమాల్లో క్లియర్ గా కనిపిస్తాయి. చాలా సినిమాల్లో డబుల్ మీనింగ్ లు వినిపిస్తాయి.

ఆర్ఆర్ఆర్ లో ఇలాంటి వ్యవహారాలను దూరంగా పెట్టినా దేశభక్తి వీరుడు అల్లూరిని బ్రిటిష్ వారి దగ్గర ఊడిగం చేసినట్లు తన కల్పనాశక్తిన ప్రదర్శించారు. ఏమైనా అంటే అది కల్పిత పాత్ర అంటారు. కానీ దాని స్ఫూర్తి అల్లూరి పాత్ర అని మళ్లీ అంటారు. అల్లూరి పాత్ర స్ఫూర్తి అయితే అంత నీచంగా అల్లూరి గురించి ఊహిస్తారా ఎవరైనా?