రాజమౌళితో సినిమా చేస్తేనే పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందనే భ్రమలు తొలగిపోతున్నాయి. నాలుగేళ్ల కాలం ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ వృధాగా వెచ్చించారు. వచ్చిన ఆదాయం మహా అయితే చెరో 35 కోట్లు. అదే నాలుగేళ్లలో నాలుగు సినిమాలు చేసి వుంటే చెరో 150 కోట్లు వచ్చి వుండేవి. పోనీ అలా అని ఆర్ఆర్ఆర్ చేయడం వల్ల పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి పడిందా అంటే గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఎన్టీఆర్ కు అయితే మరీనూ.
పోనీ రాజమౌళి లేకుండా పాన్ ఇండియా ఇమేజ్ రాదా అంటే బన్నీ, యష్, విజయ్ దేవరకొండ ల పరిస్థితి ఏమిటి? పుష్పహిట్ తో రెండో భాగం కు ఓ రేంజ్ బజ్ రావడం ఖాయం. అలాగే పూరితో చేస్తున్న సినిమా హిట్ అయితే విజయ్ కు బాలీవుడ్ ఆఫర్లు వస్తాయి. కెజిఎఫ్ సిరీస్ తో యష్ ఆల్రెడీ పాన్ ఇండియా హీరో అయిపోయాడు.
అందువల్ల ఇక రాజమౌళి మాత్రమే దిక్కు అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేయాల్సిందే. కెజిఎఫ్ 2 చూసిన తరువాత ఆర్ఆర్ఆర్ లో పిల్లాడని కాపాడడానికి బ్రిడ్జి మీద నుంచి అటు ఇటు వేలాడిన సీన్ ..జూ..జూ..బి అనిపిస్తుంది. నదిలో పడిన పిల్లవాడినికి కాపడానికి అంత హంగామా. సీన్ కు అవసరం వుంటే ఎంత ఎలివేషన్ అయినా చేస్తే అదో అందం.
అలాకాకుండా ఎలివేషన్ కోసమే సీన్ తీసినట్లు వుంటుంది రాజమౌళి వ్యవహారం. కెజిఎఫ్ లో ప్రతి ఫ్రేమ్ కొత్తగా, ఆఖరికి హీరో చావు కూడా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి దర్శకుడు ప్రశాంత్ నీల్. ఓ సూపర్ హీరో మరణమే సినిమాకు క్లయిమాక్స్ అయినపుడు దాన్ని చిత్రీకరించడానికి దర్ళకుడు పడే స్ట్రగుల్ ఓ లెవెల్ లో వుంటుంది. కెజిఎప్ 2 అది కనిపిస్తుంది.
పుష్ప సినిమా కారణంగా ఎన్నో తెలుగు సినిమాలు హిందీ వెర్షన్ విడుదల చేసే ఆలోచనలో పడ్డాయి. ఈ సినిమా కారణంగానే బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. దీనికి రాజమౌళి దర్శకుడు కాదు. సుకుమార్ దర్శకుడు. ఆర్ఆర్ఆర్ ను చాలా ఏరియాల్లో తొసిరాజని నిలిచింది. దానికీ రాజమౌళి దర్ళకుడు కాదు.
పైగా ఇద్దరు నోటెడ్ హీరోలు, రెండు కమ్యూనిటీలు, దీనికి తోడు చేయేబోయే సినిమా హీరో ఫ్యాన్స్. ఇలా అన్ని వైపుల నుంచి మద్దతు వస్తే ఆర్ఆర్ఆర్ సినిమా నిలబెట్టుకున్నారు. ఎక్కడిక్కడ గ్రాస్ ల్లోంచి నెట్ లు కట్టేసి అవే షేర్ లుగా చలామణీ చేసారు. నైజాం వంద కొట్ల షేర్ దాటలేదు అని డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజునే బాహాటంగా చెప్పారు. ఇన్ని పిగర్లు వేసినా, ఈస్ట్ కు ఖర్చులు కూడా రాలేదు. వెస్ట్ కు కోటి లాస్. అదర్ స్టేట్స్ సంగతి చెప్పనక్కరలేదు.
అంతెందుకు కెజిఎఫ్ 2 మాదిరిగా కేవలం రిటర్న్ బుల్ అడ్వాన్స్ ల మీద రాజమౌళి సినిమాను విడుదల చేసే అవకాశం వుంటుందా? ఆర్ఆర్ఆర్ అలా చేసి వుంటే….? ఇప్పుడు సినిమా విడుదలయిన ఇన్నాళ్ల తరువాత రాజమౌళి సినిమాలో వీక్ స్ట్రిప్ట్ ఆర్ఆర్ఆర్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతే కాదు, ఆర్ఆర్ఆర్ లో రాయించుకున్న డైలాగులు ఎలా వున్నాయి? కఎజిఎఫ్ 2 లో దర్శకుడు రాసుకున్న డైలాగులు ఎలా వున్నాయి?
మొత్తానికి ఓ పెద్ద గీత కనిపిస్తోంది. ఇన్నాళ్లకు సినిమాల్లో.