ఆర్ఆర్ఆర్.. బల్లగుద్ది చెప్పలేనంటున్న రాజమౌళి

ఆర్ఆర్ఆర్ సినిమాపై రాజమౌళి మరోసారి స్పందించాడు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఈ దర్శకుడు.. ఆ సినిమా మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే  విషయాన్ని కచ్చితంగా చెప్పలేనంటున్నాడు. కాబట్టి రిలీజ్ డేట్ పై…

ఆర్ఆర్ఆర్ సినిమాపై రాజమౌళి మరోసారి స్పందించాడు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఈ దర్శకుడు.. ఆ సినిమా మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే  విషయాన్ని కచ్చితంగా చెప్పలేనంటున్నాడు. కాబట్టి రిలీజ్ డేట్ పై కూడా అప్పుడే స్పష్టత రాదంటున్నాడు. 

ఈ సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా రాబోతున్న ఆదిపురుష్, తన కలలప్రాజెక్టు మహాభారతంపై రాజమౌళి స్పందించాడు. ఆయన మాటల్లోనే…

– డాక్టర్ల మాట కోసం ఎదురుచూస్తున్నాం. కరోనా తగ్గుముఖం పడుతోంది ఇక సమస్య లేదని వాళ్లు చెప్పిన 2-3 వారాలకు సెట్స్ పైకి వెళ్తాం. నా మాట కోసం ఎన్టీఆర్, చరణ్ వెయిట్ చేస్తున్నారు. నేను ఎప్పుడంటే వాళ్లు అప్పుడు రెడీ. సెట్స్ పైకి వెళ్లిన 10-15 రోజుల్లో తారక్ ఫస్ట్ లుక్ కు సంబంధించిన విజువల్స్ షూట్ చేసేస్తాం.

– ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలీదు. బహుశా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 6-7 నెలలకు సినిమా రిలీజ్ చేయొచ్చు. కానీ ఈ విషయాన్ని కూడా నేను బల్లగుద్ది చెప్పలేను. 

– ఆదిపురుష్ పోస్టర్ ను అంతా ఇప్పుడు చూశారు కానీ నేను ఎప్పుడో చూశాను. చాలా బాగుంది. కరెక్ట్ టైమ్ లో వస్తోంది. దేశమంతా రాముడి జపం జరుగుతోంది. అయోధ్యలో భూమిభూజ జరిగింది. అందర్లో జై శ్రీరామ్ అనే భక్తి పరవళ్లు తొక్కుతోంది. ఈ టైమ్ లో రాముడి మీద సినిమా రావడం అనేది రైట్ టైమ్. ప్రభాస్ కెరీర్ ఇప్పటికే ఓ స్థాయిలో ఉంది. ఈ సినిమాతో ఇంకా ఎత్తుకు వెళ్తుంది.

– మహాభారతం అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. చాలాసార్లు చెప్పాను. కానీ ఆ ప్రాజెక్టు మొదలవ్వడానికి కనీసం 7-8 ఏళ్లు పడుతుంది. మొదలుపెట్టిన తర్వాత అది రావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. కనీసం 5 సినిమాల సిరీస్ గా తీయాలి. కాబట్టి మహాభారతం అనేది 10 సంవత్సరాల ప్రాజెక్టు. 

బాబు రామ్…ఎవ‌రో ఇచ్చిన స్క్రిప్టులు చ‌ద‌వ‌కు