Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

తెరపైకి మేకప్ లేని రాజశేఖర్

తెరపైకి మేకప్ లేని రాజశేఖర్

హీరో రాజశేఖర్ తెరవెనక అవతారానికి, తెరపై గెటప్ కు చాలా తేడా ఉంటుంది. తన సినిమాల్లో ఫుల్లుగా మేకోవర్ అయి కనిపిస్తారు ఈ సీనియర్ నటుడు. అయితే ఈసారి మాత్రం రాజశేఖర్ చిన్నపాటి షాక్ ఇచ్చారు. ఎలాంటి మేకప్ లేకుండా ఓ సినిమాలో నటించబోతున్నారు. దాదాపు తన రియల్ లైఫ్ గెటప్ తో ఆయన తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

రాజశేఖర్ కొత్త సినిమా పేరు శేఖర్. ఆయన కెరీర్ లో 91వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. తెల్లటి మీసం, తెల్ల గడ్డ, నెరసిన జుట్టుతో రాజశేఖర్ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే, కాస్త వయసుమళ్లిన పాత్రను రాజశేఖర్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఈ నటుడు.. ఈనెల మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాతో లలిత్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

మలయాళంలో హిట్టయిన ఓ సినిమాకు రీమేక్ గా రాబోతోంది 'శేఖర్' మూవీ. అయితే ఆ విషయాన్ని మాత్రం మేకర్స్ పైకి చెప్పడం లేదు.

అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ, ఇప్పుడు నిమ్మగడ్డ..

చంద్రబాబు వచ్చే వరకూ టీవీల్లో మాట్లాడిన పట్టాభి..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?