చిన్న సినిమాల మధ్యలో సీనియర్ హీరో ఎంట్రీ

సంక్రాంతికి చిన్న సినిమాలు నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. హిట్-ఫ్లాప్ సంగతి పక్కనపెట్టి, సంక్రాంతి మూడ్ ను క్యాష్ చేసుకోవాలనేది ఈ సినిమాల ఉద్దేశంగా కనిపిస్తోంది. అలా సంక్రాంతి వారంలో వరుసపెట్టి 10 సినిమాలు రెడీ…

సంక్రాంతికి చిన్న సినిమాలు నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. హిట్-ఫ్లాప్ సంగతి పక్కనపెట్టి, సంక్రాంతి మూడ్ ను క్యాష్ చేసుకోవాలనేది ఈ సినిమాల ఉద్దేశంగా కనిపిస్తోంది. అలా సంక్రాంతి వారంలో వరుసపెట్టి 10 సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్ లోకి మరో 2-3 సినిమాలు కూడా చేరే అవకాశం ఉంది. ఇప్పుడీ చిన్న సినిమాల మధ్యలోకి ఓ సీనియర్ హీరో ఎంటర్ అవుతున్నాడు. అతడే రాజశేఖర్.

అవును.. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న శేఖర్ మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని గతంలోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడదే నిజం కాబోతోంది. రేపోమాపో సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేయబోతున్నారు.

ఆర్ఆర్ఆర్ వాయిదా పడకముందే శేఖర్ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డంతో మరో ఆలోచన లేకుండా ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించాలని అనుకుంటున్నారు. అదే కనుక జరిగితే చాలా చిన్న సినిమాలు సంక్రాంతి నుంచి తప్పుకోవడం గ్యారెంటీ.

రాజశేఖర్ కెరీర్ లో 91వ చిత్రమిది. మలయాళంలో సూపర్ హిట్టయిన ఓ సినిమాకు రీమేక్ గా వస్తోంది శేఖర్. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. నాగ్ బంగార్రాజుపై ఇప్పటికే డౌట్స్ ఎక్కువయ్యాయి. ఆ సినిమా కూడా తప్పుకుంటే, సంక్రాంతికి ఓ మోస్తరు అంచనాలతో వచ్చే సినిమా శేఖర్ మాత్రమే.