రాజు..దొంగ..ఓ కిరీటం

పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్న సినిమా రాజ రాజ చోర. శ్రీవిష్ణు కథానాయకుడు. ఈ సినిమా ఎప్పుడో విడుదలకు రెడీ అయిపోయింది.  Advertisement కరోనా రెండో దశ లాక్ డౌన్ తరువాత…

పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్న సినిమా రాజ రాజ చోర. శ్రీవిష్ణు కథానాయకుడు. ఈ సినిమా ఎప్పుడో విడుదలకు రెడీ అయిపోయింది. 

కరోనా రెండో దశ లాక్ డౌన్ తరువాత విడుదలకు సిద్దం అవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలకు తెరతీసారు. ఇందులో భాగంగా సినిమా కాన్సెప్ట్ ను ఓ చిన్న విడియో రూపంలో వదిలారు. సోషల్ మీడియా సెలబ్రిటీ గంగవ్వ చేత ఓ కథ మాదిరిగా సినిమా కాన్సెప్ట్ ను చెప్పించారు.

ఎలా చెప్పించినా, ఏం చేప్పించినా, జనాలకు కన్వే చేసిన పాయింట్ ఏమిటంటే హీరో దొంగ అన్నదే రాజు,కిరీటం అన్న పాయింట్లు ఎలా వున్నా, కీలకమైన దొంగతనం చుట్టూ కథ తిరుగుతుందని అన్యాపదేశంగా చెప్పినట్లు అయింది. 

హషిత్ గోలి డైరక్షన్ లో తయారవుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్. వివేక్ సాగర్ స్వరకర్త.