కరోనా వ్యాక్సిన్: అయస్కాంతంగా మారిన శరీరం

కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామందికి అవగాహన ఉంది. కొందరికి జ్వరం వస్తుంది, మరికొందరిలో ఒళ్లు నొప్పులు కనిపిస్తాయి. పారాసెట్మాల్ వేసుకుంటే ఒకటి లేదా 2 రోజుల్లో అన్నీ తగ్గిపోతాయి. కానీ కరోనా…

కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామందికి అవగాహన ఉంది. కొందరికి జ్వరం వస్తుంది, మరికొందరిలో ఒళ్లు నొప్పులు కనిపిస్తాయి. పారాసెట్మాల్ వేసుకుంటే ఒకటి లేదా 2 రోజుల్లో అన్నీ తగ్గిపోతాయి. కానీ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత తన శరీరం మొత్తం అయస్కాంతంలా మారిపోయిందంటున్నాడు ఓ వ్యక్తి. శరీరం ఉక్కులా మారుతుందనుకుంటే, అయస్కాంతం అయిందంటున్నాడు.

నాసిక్ కు చెందిన అరవింద్ సోనార్, కరోనా టీకా 2 డోసులు తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన శరీరానికి వస్తువులు అంటుకోవడం గమనించాడు. చెమట వల్ల ఇలా జరిగిందేమోనని భావించి, స్నానం చేసొచ్చి మళ్లీ పరీక్షించుకున్నాడు. అయినప్పటికీ ఇంట్లో ఉన్న స్పూన్లు, ప్లేట్లు, నాణాలు అతడి శరీరానికి అంటుకోవడం గమనించాడు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు.

విషయం తెలుసుకున్న వెంటనే మహారాష్ట్ర వైద్య నిపుణులు రంగంలోకి దిగారు. సోనార్ తో మాట్లాడారు. రక్త నమూనాలు తీసుకున్నారు. తమ నివేదికను ప్రభుత్వానికి పంపించారు. వ్యాక్సినేషన్ వల్లనే శరీరం అయస్కాంతంలా మారిందనే విషయాన్ని అప్పుడే నిర్థారించలేమంటున్నారు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యుడు అశోక్ తోరాట్.

అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. కరోనా టీకా తీసుకుంటే మనిషి శరీరం అయస్కాంతంలా మారుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. టీకాల వల్ల మ్యాగ్నెటిక్ రియాక్షన్ రాదంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకటించింది. మరోవైపు వ్యాక్సిన్ లో మైక్రో చిప్స్ ఉన్నాయనే వాదనల్ని కూడా కొట్టిపారేసింది.

కొంతమంది శరీరాలు ఒక్కోసారి అయస్కాంతంలా పనిచేస్తాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చూశాం. దేశవిదేశాల్లో ఇలాంటి వ్యక్తులున్నారు. కరోనా టీకాలకు శరీరంలో అయస్కాంత గుణానికి ఎలాంటి సంబంధం లేదు.