నెపొటిజం వల్ల ఛాన్సులు కోల్పోయా

నెపొటిజం తనపై కూడా ప్రభావం చూపించిందని అంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దీని వల్ల తను కూడా కొన్ని అవకాశాలు కోల్పోయానని, అయితే అందులో తప్పు లేదని కూడా చెబుతోంది. Advertisement “అవును..…

నెపొటిజం తనపై కూడా ప్రభావం చూపించిందని అంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దీని వల్ల తను కూడా కొన్ని అవకాశాలు కోల్పోయానని, అయితే అందులో తప్పు లేదని కూడా చెబుతోంది.

“అవును.. నెపొటిజం వల్ల నేను కూడా అవకాశాలు కోల్పోయాను. కానీ నేను అందుకు బాధపడడం లేదు. ఆ సినిమాలు నాకు రాసిపెట్టలేదంతే. అంతకుమించి నెపొటిజం గురించి నేను ఎక్కువ ఆలోచించను. ఎందుకంటే అది సహజం. స్టార్ కిడ్స్ కు అవకాశాలు ఈజీగా వస్తాయి. వాళ్ల తల్లిదండ్రుల కష్టం నుంచి అది వచ్చింది. ఆ క్రెడిట్ వాళ్ల తల్లిదండ్రులకు దక్కుతుంది.”

నెపొటిజంపై ఎక్కువగా ఆలోచించడం టైమ్ వేస్ట్ అంటోంది రకుల్. ప్రతి రంగంలో అది ఉందని, భవిష్యత్తులో తన పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తానంటే కచ్చితంగా తన వంతు సాయం అందిస్తానని, లైన్లో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకోమని చెప్పనని అంటోంది రకుల్.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చింది రకుల్. ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగానని, అలాంటప్పుడు తన పిల్లలకు తన బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడితే అంతకంటే ఇంకేం కావాలని అంటోంది.

11 Replies to “నెపొటిజం వల్ల ఛాన్సులు కోల్పోయా”

  1. mari deepika kiara,sai palliavi laki kuda background ledhu ga ela cinema lu vachai? telugu lo only glamour doll laga cheyakunda performance oriented films kuda chesi vunte ur sitution wud have been differnt..n becoming so skinny for the sake of hind films also a big let down for you..no need to cry nepo kids even u had back to back 6 releases in hindi..unfortunately all bombed at box office

  2. పుట్టుక బట్టి లాభాలు నష్టాలు ఉంటాయి.. చాలామంది తమ పుట్టుకను ఆసరాగా తీసుకొని ముడిపెట్టి రాజకీయాలు చేస్తారు కూడా…

Comments are closed.