చూడ్డానికి కాస్త మొహమాటస్తుడిలా కనిపిస్తాడు రామ్. ఇండస్ట్రీలో కూడా ఎవ్వరితో పెద్దగా కలిసినట్టు కనిపించడు. మరి ఇతడు ఫ్రెండ్స్ తో ఎలా ఉంటాడు.. వాళ్లను ఎక్కడ కలుస్తాడు?
“నేను ఛిల్ అయ్యేది నా ఇంట్లోనే. ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువగా ఛిల్ అవ్వను. నా బెస్ట్ ఫ్రెండ్ తో కూడా అప్పుడప్పుడు 6 నెలలు మాట్లాడను. కావాలని అలా చేయను, అలా జరిగిపోతుంది. వాళ్లకు కూడా నాతో అలా అలవాటైపోయింది. 6 నెలల కిందట మేం ఎక్కడ ఆగామో మళ్లీ అక్కడ్నుంచి మొదలుపెడతాం. నా కంపెనీని వాళ్లు బాగా ఇష్టపడతారు.”
ఫ్రెండ్స్ ను కలిసే విషయంలో కూడా పెద్దగా ఫార్మాలటీస్ ఉండవని చెబుతున్నాడు. ఒక్కోసారి సెడన్ గా కలవాలనిపిస్తే, సదరు ఫ్రెండ్ వేరే దేశంలో ఉన్నప్పటికీ వెళ్లిపోతానని అంటున్నాడు.
“నా మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. కలిస్తే బాగుంటుందనుకుంటే కలుస్తాను. లేదంటే ఫోన్ చేసి మాట్లాడతాను. ఓసారి ఓ ఫ్రెండ్ ను కలవాలనిపించింది. వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నేను వెళ్లిపోయాను. నా నిర్ణయాలు కూడా లాస్ట్ మినిట్ లో తీసుకుంటాను. కారులో ఎయిర్ పోర్టుకు వెళ్తూ, దారిలో టికెట్ బుక్ చేసుకుంటాను. ఎక్కడికి వెళ్లాలో అప్పుడు నిర్ణయించుకుంటాను. అలా కొన్నిసార్లు నా లగేజీ కూడా మిస్సయింది.”
ఏ దేశం వెళ్లినా అక్కడ భారతీయ రెస్టారెంట్ కోసం వెదకడంట రామ్. ఆ దేశంలో ఉన్న రుచుల్ని ఆస్వాదించడానికే ఇష్టపడతాడంట. హైదరాబాద్ లో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేడు కాబట్టి, విదేశాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా థియేటర్ కు వెళ్లి ఏదో ఒక సినిమా చూస్తాడట రామ్.
Call boy jobs available 8341510897
మెంటల్???
veedu hero naa asalu
డబ్బులు కుప్పలుగా ఉంటే ఎవడైనా ఇలాగే వుంటాడు లే.
జనం పట్టించుకోరు
Veediki balupu yekkuva