ప్రభాస్ జోకర్ లా కనిపించాడు

ప్రపంచవ్యాప్తంగా హిట్టయింది కల్కి సినిమా. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా, ఇండియాలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, ఎన్నో విభాగాల్లో ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.…

ప్రపంచవ్యాప్తంగా హిట్టయింది కల్కి సినిమా. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా, ఇండియాలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, ఎన్నో విభాగాల్లో ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రపంచం మెచ్చిన ఈ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా తనకు అస్సలు నచ్చలేదని ప్రకటించాడు అర్షద్. ఈ స్టేట్ మెంట్ లో తప్పులేదు. ఎంత పెద్ద హిట్టయిన సినిమా అయినా కొందరికి నచ్చదు. కాకపోతే, ప్రభాస్ పై అతడు చేసిన వ్యాఖ్యలు మాత్రం క్షమించరానివి.

“నాకు చాలా బాధగా ఉంది. అతడు సినిమాలో ఎందుకు జోకర్ లా కనిపించాడు. నేను మ్యాడ్ మ్యాక్స్ చూడాలనుకున్నాను. ఓ మెల్ గిబ్సన్ ను ఊహించుకున్నాను. అతడ్ని ఎందుకు అలా తయారుచేశారు. ప్రభాస్ ను ఎందుకలా చేశారో నాకు అర్థం కాలేదు.”

ఓ పాడ్ కాస్ట్ లో అర్షద్ వార్సి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ ను ఎందుకు జోకర్ గా చూపించాడో అర్థం కాలేదని, తనకు చాలా బాధేసిందని అన్నాడు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అర్షద్ పై ఆన్ లైన్ వార్ ప్రకటించారు.

50 Replies to “ప్రభాస్ జోకర్ లా కనిపించాడు”

  1. అర్షద్ వార్సి గారు అభిప్రాయం చెప్పడంలో తప్పేమీలేదు కానీ, మరీ జోకర్ లాంటి పదాలు వాడడం కొంచెం శృతి మించినట్లు వుంది అయునా తన కెరీర్ అంతా జోకర్ కారక్టర్లే చేసారు కదా పక్కన వాళ్ళని కూడా అలానే అనుకుంటారేమో

      1. అదేంది సార్, మన హీరోల స్థాయుని మనమే కించ పరచుకుంటే ఎలా, రోవాన్ ఆట్కిన్సన్ గారు గొప్పనటులు కానీ ఆయన పర్శనాలిటీకీ ప్రభాస్ గారి పర్శనాలిటీకీ పొంతన ఎక్కడ సార్.

  2. షారుక్ ఎంత జోకర్ యాక్టింగ్ చేస్తాడు.. ఇంత కేర్ లెస్ గా షారుక్ నో సల్మాన్ నో అనే దమ్ముందా ఇతగాడికి.. సౌత్ సినిమా అంటే వీళ్ళకి లోకువ.. ఒకడు ఇడ్లీ సాంబార్ అంటాడు.. ఇతగాడు నోటికి ఎంత వస్తే అంత లూస్ టాక్

  3. Kaallu chethulu pani cheyani Hero,,Dupestho Cinema ni laagisthu 50-60Dayski oka cinema complete chese valani Joker laga kakunda Hero laga ela chupistaru?

    Thanu cheppina dantlo tappemundi asalu?

    Thanu ala cheppakapoina kuda Fact aite maaripodhuga?

  4. Joker ane word konchem hard ga unna accept cheyyali. Babhubali taravata movies ki collection vastunna prabhas looks, and acting vishayam lo fans kuda happy ga leru. Daaniki todu kalki movie bagunna prabhas character boring ga undi. Prabhas anna konchem care teesukunte baguntundi

  5. సిరియస్నీస్ లేదు యాక్టింగ్ లొ, డైలాగ్ వెర్షన్ బాగోలేదు.but story different ga పెట్టాడు.

Comments are closed.