దేశంలో మరో ఆసక్తిదాయకమైన ఎన్నికల సమరానికి సమయం ఆసన్నం అవుతూ ఉంది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన రెండు నెలల్లోనే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు మొదలు కావడం ఆసక్తిని రేపుతూ ఉంది. మహారాష్ట్ర, జార్ఘండ్, హర్యానా, జమ్మూ అండ్ కశ్మీర్ అతి త్వరలో ఎన్నికలను జరుపుకోనున్న రాష్ట్రాలు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వేవ్ తగ్గడం, మోడీ మానియా తగ్గుముఖం పట్టిన పరిస్థితులు కనిపించడంతో.. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు కనిపించబోతున్నాయనే అంశం గురించి దేశం మొత్తం ఆసక్తితో ఉంది.
లోక్ సభ ఎన్నికల ఫలితాల సారాంశం అయితే ఒక్కటే.. బీజేపీకి దేశ ప్రజలు ఏకపక్షంగా పట్టం గట్టలేదు. గత రెండు పర్యాయాల లోక్ సభ ఎన్నికల్లో సొంతంగానే 273 లోక్ సభ సీట్ల మార్కును దాటిన కమలం పార్టీ ఈ సారి అందుకు సుమారు నలభై సీట్ల దూరంలో ఆగిపోయింది. ఈ సారి మోడీ ప్రధాని అయ్యింది ఎన్డీయే బలంతోనే తప్ప, బీజేపీ సొంత బలంతో కాదు. ఎన్డీయే రూపంలో మెజారిటీ దక్కింది కాబట్టి మోడీకి వరసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లభించింది.
రాబోయే ఐదేళ్లూ ఎన్డీయేలోని మిత్రపక్షాల మీదే మోడీ పదవి ఆధారపడి ఉంది కూడా! మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన సర్వత్రా ఆసక్తిని రేకెత్తించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు! రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనను బట్టే .. ఎన్డీయేలోని మిత్రపక్షాలు కూడా మోడీని ఖాతరు చేసే స్థాయి ఆధారపడి ఉంటుంది! రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందనే పరిస్థితి కనిపిస్తే కమలం పార్టీ దాని మిత్రపక్షాలకు కూడా లోకువగా మారే అవకాశాలుంటాయి!
బీజేపీకి ఇప్పటికీ ఉన్న పెద్ద అస్సెట్ మోడీ ఇమేజే! దాని మీదే ఆ పార్టీ పూర్తిగా ఆధారపడి పోయింది. గతంలో బీజేపీ అంటే సంఘ్ పరివార్. అదొక పెద్ద కుటుంబం. అయితే మోడీ ప్రధాని అయ్యాకా ఆ పార్టీ పూర్తిగా ఏకవ్యక్తి స్వామ్యంగా మారిందనడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. మోడీ లేకుండా ఇప్పుడు బీజేపీని ఊహించడం కూడా కష్టం! రేపు ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోడీనే ముందుండి ప్రచారం చేయాలి! ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టుగా ప్రచారం జరగాలి!
మహారాష్ట్రాలో అయినా, జార్ఘండ్ లో అయినా, హర్యానాలో అయినా మోడీనే సీఎం అభ్యర్థి అన్నట్టుగా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది కమలం పార్టీ. ప్రధానిగా తన విధులు ఎన్ని ఉన్నా.. మోడీ ఇలా రాష్ట్రాల ఎన్నికలు వచ్చినప్పుడు తనే సీఎం క్యాండిడేట్ అన్నట్టుగా మారిపోతూ ఉంటారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మోడీ విపరీత స్థాయిలో ప్రచారం చేశారు. వారాలకు వారాలు కేటాయించి కర్ణాటకలో సుదీర్ఘ ర్యాలీలు, సుదీర్ఘ ఎన్నికల సభలు, విపరీతమైన ప్రచార విధులు నిర్వర్తించారు.
కర్ణాటకలో మోడీనే బీజేపీ సీఎం క్యాండిడేట్ అన్నట్టుగా అప్పుడు ప్రచారం జరిగింది. అయితే కన్నడనాట బీజేపీ అప్పుడు ఓటమి పాలయ్యింది. మోడీ అంత స్థాయిలో ప్రచారం చేసినా.. కన్నడీగులు బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ కు పట్టం గట్టారు! అది మోడీకి ఎదురుదెబ్బే! అయితే.. లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ తో పొత్తుతో వెళ్లి కర్ణాటకలో బీజేపీ తిరిగి పట్టును నిలబెట్టుకుంది! మరి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకూ, లోక్ సభ ఎన్నికలకు కాస్త విభిన్నమైన తీర్పును ఇచ్చారు ఆ రాష్ట్ర ప్రజలు.
అలాగే ఇప్పుడు మహారాష్ట్ర సంగతిని మాట్లాడుకున్నా.. అక్కడ బీజేపీకి గట్టి ఝలక్ తగిలింది. శివసేన చీలిక పక్షంతో, ఎన్సీపీ చీలిక పక్షంతో మితృత్వాలను నెరుపుతూ వాటితో పొత్తులు పెట్టుకుని, వాటి గుర్తులను వాటికే ఉండేలా చూసుకుని బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. అయితే ఆ చీలిక పక్షాలకు అయినా ఊరట విజయాలు దక్కాయేమో కానీ బీజేపీకి మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది అక్కడ!
మోడీ కోసం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా మోడీ ఇమేజ్ అక్కడ బీజేపీ ని గట్టెక్కించలేకపోయింది. అలాంటిది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిదాయకమైన అంశం. మహారాష్ట్రలో అధికారం ఏ రాజకీయ పార్టీకి అయినా కీలకం. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర. దేశంలో జీఎస్టీలు అత్యధిక స్థాయిలో వసూళయ్యే రాష్ట్రం, దేశంలో అత్యంత రిచెస్ట్ స్టేట్! ఇదంతా ముంబయి మహానగరం దానికి రాజధానిగా ఉండటం మూలానే అని వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ గత ఐదేళ్లలో చాలా పాట్లే పడింది. రాత్రికి రాత్రి ప్రభుత్వాలను మార్చేసింది. నేతలను చేర్చుకుంది.
గతంలో తను విపరీతంగా ఆరోపణలు చేసిన వారినే నెత్తికెత్తుకుంది. పార్టీలను చీల్చింది. నానా రచ్చా చేసింది. అంత చేసినా లోక్ సభ ఎన్నికల్లో గట్టి ఝలక్ తగిలింది. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గనుక బీజేపీ అక్కడ ఆధిపత్యాన్ని నిలుపులేకపోతే అది మరో ఝలక్ అవుతుంది.
దేశంలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేయాలనేది బీజేపీ గత పదేళ్లుగా కంటున్న కల. ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలు కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని ఎన్నో సార్లు ఇచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కనీసం లేచి కూర్చుంది. లోక్ సభలో విపక్ష స్థానాన్ని పొందింది అధికారికంగా. ఇప్పుడు మహారాష్ట్రలో కూటమి రూపంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ తన ఉనికిని చాటుకునే ప్రయత్నంతో ఉంది. హర్యానాలో బీజేపీతో కాంగ్రెస్ కే వార్. అలాగే పదేళ్ల తర్వాత అయిన జే అండ్ కేలో ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ అండ్ కశ్మీర్ లో చాలా మెరుగైన పోలింగ్ శాతం నమోదు అయ్యింది. తద్వారా కశ్మీరీలు తాము ఎన్నికల నిర్వహణ కోసం ఎదురుచూస్తున్నామనే సందేశాన్ని ఇచ్చారు. మొత్తానికైతే మూడో పర్యాయంలో మోడీ మొదటి యూనిట్ టెస్ట్ ను ఎదుర్కొంటూ ఉన్నారు. అది కూడా కఠినమైన పరిస్థితులు ఉన్న రాష్ట్రాల్లో!
మనం కోరుకున్నట్టే ఇప్పుడు మోడీ మన ఎంపీ ల మీద ఆధార పడ్డాడు.. ఇక మోడీ మెడలు వొంచుతా — ఆడ సింగిల్ సింహం the Leven ల0గా
Call boy jobs available 8341510897
Vc available 9380537747
జార్ఖండ్ లో గెలిచే అవకాశం ఉంది, మహారాష్ట్ర, హర్యానా లలో గెలిచే అవకాశం లేదు, అయినా గెలవాలి అని ఆశిద్దాం!
RBI నివేదికను బట్టి సుస్ప ష్టం
‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే
కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు
మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.
మార్గదర్శి ఫైనాన్సి యర్స్ నిబం ధనలకు విరుద్ధం గా ప్రజల నుం చి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (ఆర్బీఐ) మరోసారి విస్ప ష్టం గా ప్రకటిం చిం ది
మాడ గానికి మూడింది